AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US President Joe Biden: అమెరికాలో పెట్రోల్‌, డీజిల్‌ కార్లకు మంగళం.. డెడ్‌లైన్‌ ఇచ్చేసిన జో బైడెన్‌

US President Joe Biden: రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుండటంతో..

US President Joe Biden: అమెరికాలో పెట్రోల్‌, డీజిల్‌ కార్లకు మంగళం..  డెడ్‌లైన్‌ ఇచ్చేసిన జో బైడెన్‌
Us President Joe Biden
Subhash Goud
|

Updated on: Mar 23, 2021 | 11:45 AM

Share

US President Joe Biden: రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుండటంతో ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అమెరికాలో మాత్రం కాలుష్యం తీవ్రంగా ఉంటోంది. రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2035 సంవత్సరం నాటికి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల అమ్మకాలను ముగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వాహన తయారీ సంస్థలను కోరారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్‌ వాహనాలు వస్తున్న నేపథ్యంలో రాబోయే పది, పదిహేనేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల అమ్మకాలు నిలిపివేయాలని కోరారు. ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో నివేదిక ప్రకారం.. అమెరికాలో సెనేటర్లు 2035 నాటికి దేశంలో ఇంధనంతో కూడిన వాహనాల అమ్మకాలు నిలిపివేయాలని బైడెన్‌ను కోరారు.

ఈ క్రమంలో వాహనాల అమ్మకాల నిలిపివేతపై బైడెన్‌కు లేఖ రాశారు. ఈ కాలుష్య నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బైడెన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నారు. 2035 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ కార్ల విక్రయాలపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలించిన ఓ బైడెన్‌ ఈ మేరకు వాహన తయారీ సంస్థను కోరారు. దీంతో రానున్న పదిహేనేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ కార్లపై నిషేధం విధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2035 నాటికి అమెరికాలో పెట్రోల్‌, డీజిల్‌లో నడిచే కార్ల పూర్తిగా కనుమరుగు కానున్నాయి.

ప్రపంచదేశాలన్ని ప్రస్తుతం పర్యావరణంపై దృష్టి సారించాయి. పొల్యూషన్‌ను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై మొగ్గు చూపుతున్నాయి. రానున్న పదేళ్లలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊహించని స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంధనంతో నడిచే కార్లను నిషేధిస్తూ ఎంతో మేలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వల్ల ఎలాంటి ముప్పు ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో 2033 నాటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పూనుకున్నారు.

ఇవీ చదవండి:

US Supermarket Shooting: అమెరికాలో రెచ్చిపోయిన దుండగులు.. సూపర్‌ మార్కెట్‌ వద్ద కాల్పులు.. 10 మంది మృతి

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారు బోల్తా.. భారీగా చెలరేగిన మంటలు.. ముగ్గురు సజీవదహనం

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో