Rajasthan: బాధితురాలిపై లైంగిక వేధింపులు.. రాజకీయ దుమారంతో ఏసీపీని డిస్మిస్ చేసిన ప్రభుత్వం

తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసిన బాధితురాలిని లైంగికంగా వేధించిన పోలీసు ఆఫీసర్ ను సర్వీసుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జరీ చేసింది  రాజస్థాన్ ప్రభుత్వం.

Rajasthan: బాధితురాలిపై లైంగిక వేధింపులు.. రాజకీయ దుమారంతో ఏసీపీని డిస్మిస్ చేసిన ప్రభుత్వం
Rajasthan Police
Follow us
Anil kumar poka

|

Updated on: Apr 03, 2021 | 1:13 PM

Rajasthan: తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసిన బాధితురాలిని లైంగికంగా వేధించిన పోలీసు ఆఫీసర్ ను సర్వీసుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జరీ చేసింది  రాజస్థాన్ ప్రభుత్వం. మార్చి నెలలో రాజస్థాన్ లో సంచలనం సృష్టించిన ఈ కేసులో  ఏసీపీ కైలాష్ బోరా పై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం.  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ లో ఓ మహిళ అత్యాచారానికి గురి అయింది. దీంతో ఆమె అక్కడి ప్రత్యేక మహిళల పై జరిగిన నేరాలను విచారించే విభాగానికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు అందుకున్న ఆ విభాగపు ఏసీపీ కైలాష్ బోరా..కేసు విచారణ కోసం బాధితురాలి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. బాధితురాలు తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో ఆమెను లైంగికంగా తనకు లొంగిపోవాల్సిందిగా కోరారు. దీంతో సదరు బాధితురాలు ఏసీబీ అధికారులకు ఈ విషయాన్ని ఫిర్యాదు చేసింది.

దీంతో ఏసీబీ అధికారులు ఏసీపీ కైలాష్ బోరాను మర్చి 14వ తేదీన అరెస్ట్ చేసింది. అప్పట్లో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది.  అయితే, ఈ కేసు విషయంలో రాజకీయంగా పెనుదుమారం రేగింది. అక్కడి ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తింది. ఏసీపీని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి కుమార్ ధరీవాల్ ఏసీపీ కైలాష్ ను సర్వీసు నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు.

ఏసీపీ కైలాష్ ను సర్వీసుల నుంచి తొలగించడం కోసం ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ నుంచి అనుమతి కోరింది. ఈమేరకు శుక్రవారం గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో మార్చి 20న రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అభయ్ కుమార్ ఏసీపీ కైలాష్ బోరాను కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవాలని మార్చి 20 వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల స్థానంలో ఆర్టికల్ 311(2) ప్రకారం గవర్నర్ అనుమతితో కైలాష్ ను సర్వీసుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.