Jani Master: బెయిల్‌పై బయట ఉన్న జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఇక శాశ్వతంగా..

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అభియోగాలు ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఇదే కేసులో జైలుకు వెళ్లి వచ్చారు జానీ. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఈ స్టార్ కొరియోగ్రాఫర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.

Jani Master: బెయిల్‌పై బయట ఉన్న జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఇక శాశ్వతంగా..
Jani Master
Follow us
Basha Shek

| Edited By: Rajeev Rayala

Updated on: Dec 09, 2024 | 6:34 PM

గత కొన్ని రోజులుగా అటు పర్సనల్ లైఫ్ లోనూ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ బాగా స్ట్రగుల్ అవుతున్నాడు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసిన ఓ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జానీపై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో అతను సుమారు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు. కొన్ని రోజుల క్రితమె బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. తన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. అయితే చాలా రోజుల తర్వాత ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు జానీ మాస్టర్. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్)కు హాజరైన జానీ కాస్త ఎమోషనల్ గా మాట్లాడాడు. కాగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ ప్రొఫెషనల్ కెరీర్ కూడా బాగా దెబ్బతింది. చేతి దాకా వచ్చిన జాతీయ అవార్డు దూరమైంది. అలాగే పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయాల్సి ఉన్నా అది కూడా వేరొకరికి వెళ్లిపోయింది. తాజాగా జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి ఇతన్ని శాశ్వతంగా తొలగించారు. అంతేకాకుండా ఆదివారం (డిసెంబర్ 08) జరిగిన డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ అధ్యక్షుడిగా గెలిచారు. ఇది నిజంగా జానీ మాస్టర్ కు భారీ ఎదురు దెబ్బేనని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఈ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కు బాలీవుడ్ లో ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని టాక్. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్న బేబీ జాన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు అవకాశం వచ్చిందని సమాచారం. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ మళ్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ తేరీ రీమేక్ గ ఈ మూవీ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం.

ఇవి కూడా చదవండి

జానీ మాస్టర్ డ్యాన్స్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..