Jailer: రజనీ ‘జైలర్‌’ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌ .. వారికి 300 మందికి గోల్డ్‌ కాయిన్స్.. వీడియో చూశారా?

ఏకంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజనీకి గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. ఇక సెప్టెంబర్‌ నుంచి ఓటీటీలోనూ సందడి చేస్తున్నాడు జైలర్‌. మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇలా ఎక్కడ చూసినా రికార్డులు బద్దలు కొడుతున్నాడు జైలర్‌. దీంతో సినిమా నిర్మాత ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రీ రిలీజ్‌కు మించి భారీగా లాభాలు రావడంతో సినిమా యూనిట్‌తో కలిసి తన ఆనందాన్ని పంచుకుంటున్నారు

Jailer: రజనీ 'జైలర్‌' బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌ .. వారికి 300 మందికి గోల్డ్‌ కాయిన్స్.. వీడియో చూశారా?
Jailer Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2023 | 8:51 PM

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ నటించిన లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా జైలర్‌. ఆగస్టు 10 న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది. ఏకంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజనీకి గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. ఇక సెప్టెంబర్‌ నుంచి ఓటీటీలోనూ సందడి చేస్తున్నాడు జైలర్‌. మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇలా ఎక్కడ చూసినా రికార్డులు బద్దలు కొడుతున్నాడు జైలర్‌. దీంతో సినిమా నిర్మాత ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రీ రిలీజ్‌కు మించి భారీగా లాభాలు రావడంతో సినిమా యూనిట్‌తో కలిసి తన ఆనందాన్ని పంచుకుంటున్నారు సన్‌ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌. ఇప్పటికే హీరో రజనీ కాంత్‌ , డైరెక్టర్‌ నెల్సన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌లకు ఖరీదైన లగ్జరీ కార్లు బహుమతిగా ఇచ్చారు. అలాగే నిరుపేద పిల్లల గుండె శస్త్రచికిత్సల కోసం అపోలో ఆస్పత్రికి ఏకంగా కోటి రూపాయలకు విరాళంగా అందించారు. ఇవే కాకుండా తమకు వచ్చిన లాభాలను పలు సామాజిక సేవా కార్యక్రమాలను వినియోగిస్తున్నారు మారన్‌. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు సన్‌పిక్చర్స్‌ అధినేత. జైలర్‌ సినిమా కోసం పనిచేసిన 300 మంది సిబ్బందికి ఆదివారం (సెప్టెంబర్‌ 9) గోల్డ్‌ కాయిన్స్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లో రుచికరమైన వంటకాలతో విందు ఏర్పాటుచేశారు కళానిధి మారన్‌. బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా భారీ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం గోల్డ్‌ కాయిన్స్‌ ఇచ్చాక అందరితో కలిసి భోజనం చేశారు. నిర్మాత మారన్‌తో పాటు డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కూడా ఈ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు.

దీనికి సంబంధించిన వీడియోను సన్‌పిక్చర్స్‌ సంస్థ తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. 300 మందికి పైగా వ్యక్తులను బంగారు కాయిన్లతో నిర్మాత ఘనంగా సన్మానించారంటూ ఇందులో పేర్కొంది. కాగా జైలర్‌ సినిమాలో రజనీతో పాటు శివరాజ్‌కుమార్, మోహన్‌ లాల్‌, జాకీ ష్రాఫ్‌, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సునీల్‌, వినాయకన్‌, వసంత్ రవి, మిర్నా మీనన్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. రజనీ నటనతో పాటు అనిరుధ్ అందించిన బీజీఎమ్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఇక ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది జైలర్‌ సినిమా. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

300 మందికి గోల్డ్ కాయిన్స్ పంపిణీ.. వీడియో చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..