- Telugu News Photo Gallery Cinema photos Athulyaa Ravi comments dating and releationships now a days telugu cinema news
Athulyaa Ravi: పెళ్లికి ముందే సహజీవనం.. ఇప్పుడిదే ట్రెండ్ అంటోన్న హీరోయిన్.. కానీ..
తమిళ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో అతుల్య రవి ఒకరు. 2017లో కాదల్ కన్ కట్టుడే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అతుల్య రవి. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇక ఇటివలే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యకు వర్జినిటీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.
Updated on: Sep 10, 2023 | 9:00 PM

తమిళ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో అతుల్య రవి ఒకరు. 2017లో కాదల్ కన్ కట్టుడే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అతుల్య రవి. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

ఇక ఇటివలే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యకు వర్జినిటీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు ?.. అని ప్రశ్నించగా.. అతుల్య స్పందిస్తూ.. తన అభిప్రాయం ప్రకారం 21 నుంచి 25 ఏళ్లు వయసు కరెక్ట్ అనిపిస్తోందని చెప్పుకొచ్చింది.

అలాగే పెళ్లికి ముందు లైంగిక చర్యలో పాల్గొనడం సరైందేనా ? లేక పెళ్లి తర్వాత మంచిదా ?.. అని ప్రశ్నించగా.. ఇందుకు అతుల్య సూటిగానే స్పందించింది.

తన అభిప్రాయం ప్రకారం పెళ్లి తర్వాతే లైంగికరమైన రిలేషన్ షిప్ ఉత్తమమని... అది మన ఆచార వ్యవహారాలు, సంస్కృతికి అద్దం పడుతోందని చెప్పుకొచ్చింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ వల్ల ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి.

ఈ జనరేషన్లో రిలేషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకరితో రిలేషన్ లో ఉండడమనేది అది వారి వ్యక్తిగత నిర్ణయం. దీనిపై ఎవరికీ అధికారం లేదు. అయిత వివాహమే అన్నిటికంటే బెస్ట్ రిలేషన్ అని చెప్పుకొచ్చింది అతుల్య.





























