Jagapathi Babu: హీరో థ్యాంక్స్ మీట్లో జగపతి బాబు ఆసక్తికర కామెంట్స్.. పదిహేనేళ్లుగా థియేటర్‌కు వెళ్లలేదంటూ..
యంగ్ హీరో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం హీరో. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా
![Jagapathi Babu: హీరో థ్యాంక్స్ మీట్లో జగపతి బాబు ఆసక్తికర కామెంట్స్.. పదిహేనేళ్లుగా థియేటర్‌కు వెళ్లలేదంటూ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/jagapathi-babu.jpg?w=1280)
యంగ్ హీరో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం హీరో. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. గల్లా పద్మావతి నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, బ్రహ్మాజీ, రోల్ రీడా కీలకపాత్రలలో నటించారు. హీరో సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే హీరో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది టీం. ఈ సందర్భంగా నటుడు జగపతి బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
జగపతి బాబు మాట్లాడుతూయ.. నేను గత 15 ఏళ్ళుగా థియేటర్‌కు వెళ్ళలేదు. ఈ సినిమాకోసం వెళ్ళి చూశాను. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. మొదట్లో ఈ సినిమా చేయవద్దని అనుకున్నా. పెద్ద సినిమాలలో నటించిన నాకు కొత్త హీరో దర్శకుడుతో చేయాలనిపించలేదు. కానీ పద్మగారు మా సోదిరికి ఒకటికి పదిసార్లు ఈ పాత్ర నేను చేస్తేనే బాగుంటుందని ఒప్పించారు. సరేలే చేద్దాం అని చేశాను. జయదేవ్ నాకిష్టమైన వ్యక్తి. ఇక సినిమా చేసేటప్పుడు నా పాత్ర పండుతుందా, లేదా అనే అనుమానం కూడా వుంది. కానీ దర్శకుడు నా అంచనాలను తారుమారు చేసి ప్రేక్షకులు ఎంజయ్ చేసేలా చేశాడు. ఈ సినిమా చూశాక నేను చేసిన హనుమాన్ జంక్షన్ గుర్తుకువచ్చింది. ఇలాంటివి తీయాలంటే దర్శకుడు గొప్పతనం చూపించాలి. హీరో అశోక్‌లో తపన కనిపించింది. ఒకటికి రెండు సార్లు సీన్ బాగా వచ్చేదాకా చేసేవాడు. ఇక నరేశ్ పాత్ర చాలా క్రూరంగా వుంది. ఒకరకంగా జలసీ కలిగేలా ఆ పాత్ర చేసి మెప్పించాడు అని తెలిపారు.
Radhe Shyam: మార్చిలో సందడి చేయనున్న రాధేశ్యామ్.? నెట్టింట వైరల్ అవుతోన్న విడుదల తేదీ..
Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..