Roja- Hyper Aadi: జబర్దస్త్‌లో గురువు.. బయట శత్రువా? రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
నటి రోజా జడ్జీగా ఉన్న జబర్దస్త్ షోతోనే బాగా పాపులర్ అయ్యాడు హైపర్ ఆది. తన కామెడీతో టీమ్ లీడర్ గా కూడా ఎదిగిపోయాడు. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కూడా రాణిస్తున్నాడు. కానీ..

జబర్దస్త్ ప్రారంభమైన 2013 నుంచే రోజా జడ్జీగా చేశారు. చాలా ఏళ్ల పాటు ఆ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడం, మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో క్రమంగా ఈ కామెడీ షోకు దూరమయ్యారామె. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యక మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు రోజా. జబర్దస్త్ లో చేయడం లేదు కానీ ఇతర టీవీ షోస్ లో బాగానే సందడి చేస్తున్నారామె. కాగా ఇదే జబర్దస్త్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. సాధారణ కమెడియన్ గా ఈ షోలో అడుగు పెట్టిన అతను ఆ తర్వాత తన ట్యాలెంట్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. తనదైన కామెడీ పంచులతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఇక రోజా జబర్దస్త్ జడ్జీగా ఉన్న టైంలోనే ఆది స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ఈ వేదికపై ఆది వేసే జోకులను నాగబాబుతో పాటు రోజా కూడా బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రోజా జబర్దస్త్ ను విడిచి పెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయారు. హైపర్ ఆది కూడా సినిమా ఛాన్సులు రావడంతో క్రమంగా ఈ షోకు దూరమైపోయాడు. అయితే జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పంచుకున్న వీళ్లంతా.. రాజకీయాల్లో వేరే వేరు పార్టీల్లో ఉండటంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు అమితంగా అభిమానించే హైపర్ ఆది జనసేన తరపున ప్రచారం చేశాడు. ఇదే సమంయలో రోజాను కూడా విమర్శించాడు. అయితే అది కేవలం రాజకీయంగానే. రోజా కూడా జబర్దస్త్ లో ఆదిని పొగిడిన నోటితోనే అల్పులు, వాళ్లెంత అంటూ ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసింది.
దీంతో ఆదికి, రోజాకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. సోషల్ మీడయాలోనూ వీరి విభేదాలపై రకరకాల పుకార్లు, కథనాలు వచ్చాయి. అయితే ఓ ఫంక్షన్ లో రోజా, హైపర్ ఆది కలుసుకున్నారు. ఇద్దరూ కూల్ గా మాట్లాడుకున్నారు. ఆతరువాత మైక్ అందుకున్న ఆది రోజా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశౄడు. ‘ ఈ ఫంక్షన్ కు రావడం ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా రోజాగారిని ఇక్కడ కలవడం మరింత సంతోషంగా ఉంది. చాలా కాలం తరువాత రోజా గారిని చూశాను. నాకు రోజా గారికి ఎలాంటి శత్రుత్వం లేదు. ఈ విషయం రోజా గారికి కూడా తెలుసు. రాజకీయంగా ఎవరి దారులు వారివి. జబర్దస్త్ లో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా రాజకీయాల గురించి మాట్లాడుకునేవారం కాదు. రోజా గారు కూడా ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఆమె అందరితో ప్రేమగా ఉండే వారు. మేం కమెడియన్లుగా ఎదగడంలో నాగ బాబు పాత్ర ఎంత ఉందో , రోజా పాత్ర కూడా అంతే ఉంది. రాజకీయంగా మాత్రమే మా దారులు వేరు. అందరు ఒకరికే సపోర్ట్ చేయాలని లేదు కదా.. అలా అని ఎప్పుడూ కొట్టుకుంటూ.. తిట్టుకుంటూ.. ఉంటారని కాదు కదా.. రాజకీయంగా ఎన్ని ఉన్నా పర్సనల్ గా ఒకరంటే ఒకరికి అభిమానం ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు ఆది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




