ప్రగ్యా జైస్వాల్ కిర్రాక్ లుక్స్.. సరికొత్త హాట్ యాంగిల్స్ వైరల్

20 May 2026

Pic credit - Instagram

Phani Ch

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.

ప్రగ్యా పర్సనల్ విషయానికి వస్తే.. 1991 జనవరి 12న జన్మించిన ఈమె ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్‌లో నటించింది. ప్రగ్యా జైస్వాల్ పూణెలోని సింబైసిస్ లా స్కూల్‌లో చదువుకుంది.

కాలేజీలో అందాల పోటీల్లో పాల్గొని అక్కడ కూడా సత్తా చాటింది. 2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు/ డేగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  

 తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో పరిచయమైంది. తొలి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకుంది.

హిందీలో టిటూ MBA సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె తెలుగులో కంచె తర్వాత చేసిన ‘నక్షత్రం’ (2017), మంచు విష్ణుతో చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలు ఈమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి.

అంతేకాదు ఆ మధ్య ‘మై చలా’ అనే మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మెరిసింది. ఈమె కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా.. కంచె మంచి సినిమాగా గుర్తింపు ఇస్తే.. అఖండ కమర్షియల్ సక్సెస్ అందించింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ సరసన నటించిన ‘అఖండ’ (2021) సినిమా ఆమె కెరీర్‌ను మళ్లీ టాప్‌లోకి లేపింది.