AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టిఫిన్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. సెకన్లలోనే అంతా ఆగమాగం.. వీడియో చూశారా..?

హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. వివేకానంద నగర్‌లో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్‌లు, ఆటో, కారును ఢీకొట్టి చివరకు టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Hyderabad: టిఫిన్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. సెకన్లలోనే అంతా ఆగమాగం.. వీడియో చూశారా..?
Hyderabad Road Accident
Sravan Kumar B
| Edited By: |

Updated on: May 21, 2026 | 8:19 PM

Share

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. వివేకానంద నగర్‌లో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై ఉన్న పలు వాహనాలను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన కారు నేరుగా ఓ టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ కారు అదుపుతప్పి.. ముందుగా రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత కారును, ఆటోను ఢీకొట్టింది.. అనంతరం బైక్ లను ఢీకొడుతూ.. పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో టిఫిన్ సెంటర్ వద్ద ప్రజలు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.

ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడినట్లు పేర్కొంటున్నారు.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కారు వేగంగా వచ్చి వాహనాలను ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us