నా ఫోన్‌లో అతని పేరు దేవుడు అని సేవ్ చేసుకున్నా.. అలా చేసి ఉంటే ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేవాడు.. కానీ
జబర్దస్త్ వేదికపై తనదైన శైలితో ప్రేక్షకులను అలరించిన అప్పారావు ఒక ఇంటర్వ్యూలో తన సహ నటుడు స్టార్ కమెడియన్ గురించి, తన వ్యక్తిగత ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అతను అందరిలా ఈవెంట్స్ చేసుంటే ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేవాడు అని అన్నారు

జబర్దస్త్ అప్పారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అప్పారావు. పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు జబర్దస్త్ అప్పారావు. ఒక ఇంటర్వ్యూలో శకలక శంకర్‌తో తన అనుబంధం, ఆయన కెరీర్, వ్యక్తిగత నమ్మకాలపై అనేక కీలక విషయాలను వెల్లడించారు. “నేను ఈ రోజు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి శకలక శంకరే కారణం” అని అప్పారావు ఎమోషనల్ అయ్యారు. శంకర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ, తన ఫోన్‌లో ఆయన పేరును దేవుడు అని సేవ్ చేసుకున్నట్లు తెలిపారు అప్పారావు. శంకర్ కెరీర్ ప్రస్తుతం ఉండాల్సిన స్థాయికి తగ్గట్టు లేదని అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్ జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా ఉన్నప్పుడు, కాలేజీలు, ఈవెంట్స్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు, ఫ్లైట్ టికెట్లు, స్టార్ హోటల్ సౌకర్యాలతో ఆయనను ఆహ్వానించేవారని అప్పారావు గుర్తుచేసుకున్నారు. కేవలం “హాయ్ చెప్పి, బాయ్ చెప్పి డబ్బులు తీసుకెళ్ళిపోమనండి” అని అడిగినా శంకర్ “మనది సినిమా, జబర్దస్త్ అయిపోయాక సినిమానే మనది” అని చెప్పి వాటిని తిరస్కరించేవారని తెలిపారు. అలా ఈవెంట్లు చేసి ఉంటే ఈ రోజు శంకర్‌కు బోలెడు డబ్బులుండేవని అప్పారావు అభిప్రాయపడ్డారు.
జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట
సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో, శంకర్ జబర్దస్త్ మానేస్తానని చెప్పినప్పుడు నాగబాబుతో పాటు చాలా మంది బాధపడ్డారని తెలిపారు. జబర్దస్త్ వల్ల వచ్చిన పేరు సినిమా ఇండస్ట్రీలో గొప్ప అవకాశాలను తెస్తుందని వారు చెప్పినట్లు వివరించారు. శంకర్ హీరోగా మారిన తర్వాత ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ పాత్రలు లభించడం తగ్గిందని, అయితే ప్రస్తుతం ఆయన ఓ తమిళ సినిమాలో హీరోగా నటిస్తూ, దర్శకత్వం కూడా చేయనున్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రమేయంపై అప్పారావు మాట్లాడుతూ, శంకర్ రాజకీయాల్లోకి వెళ్లి తన జీవితాన్ని పాడు చేసుకోలేదని అన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అపారమైన అభిమానమని, జబర్దస్త్ వేదికపై పవన్ కళ్యాణ్ శివుడి ఫోటోను వేసిన ఏకైక వ్యక్తి శంకరే అని గుర్తుచేశారు.
వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!
శంకర్ గొప్ప ఆర్టిస్ట్ అని, డ్రాయింగ్‌తో పాటు స్టోరీబోర్డ్ చేయగలడని, పాటలు పాడతాడని, డ్యాన్స్ చేస్తాడని తెలిపారు. తాను మాత్రం జనసేనకు, అనకాపల్లి ఎమ్మెల్యే రామకృష్ణ గారికి మద్దతు ఇచ్చానని, అది డబ్బు కోసం కాదని, అభిమానంతోనే అని స్పష్టం చేశారు. జబర్దస్త్‌లో తాను లేడీ గెటప్‌లు వేసి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడంపై విమర్శలకు అప్పారావు సమాధానమిచ్చారు. తన పచ్చళ్ళ పాపాయమ్మ స్కిట్ తన కెరీర్‌కు గొప్ప పునరాగమనాన్ని ఇచ్చిందని వెల్లడించారు. ఆ స్కిట్ విజయంతో తన కళ్ళల్లో నీళ్లు వచ్చాయని, నాగబాబు గారి మద్దతు స్కిట్‌కు మరింత అందాన్ని, ఫ్లేవర్‌ను చేకూర్చిందని అప్పారావు పేర్కొన్నారు.
ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




