AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Crime: పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో కలిసి..

వాళ్లిద్దరూ గాడంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకోవాలనుకున్నారు. అందుకు నిరాకరించిన పేరెంట్స్ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ప్రియుడితో కలిసి యువతి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Andhra Crime: పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో కలిసి..
Guntur Love Suicide
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 12:42 PM

Share

ప్రేమించిన యువకుడితో కాకుండా వేరే వ్యక్తిలో పెళ్లి జరగడంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి.. ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలోని స్వర్ణ భారతి నగర్‌కు చెందిన రాజు అనే యువకుడు జేకేసీ కాలేజ్‌లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రాజుకు అంకమ్మ నగర్‌కు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకొని అదే విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. రాజు పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోగా.. యువతి తల్లిదండ్రులు మాత్రం అందుకు నిరాకరించారు.

అయితే గతంలో వీళ్ల పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోగా అప్పుడు రాజు తల్లిదండ్రులు నిరాకరించారు. ఇద్దరి సామాజిక వర్గాలు కూడా వేరు కావడంతో పెళ్లి జరగలేదు. అయితే గత నెల 15వ తేదిన ఆ యువతికి తల్లిదండ్రులు మరొ వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్లిన యువతి మూడు రోజుల క్రితం గుంటూరు వచ్చింది. ఆమె వచ్చిన విషయం తెలుసుకున్న రాజు వెళ్లి ఆ యువతితో మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ నెల ఏడో తేదిన ఇద్దరూ కలిసి కొండవీడు వెళ్లారు. అక్కడ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎనిమిదో తేదిన మణికంఠరాజు చనిపోగా 9వ తేదిన యువతి కూడా చనిపోయింది. ఇద్దరూ చనిపోవడంతో రెండు కుటుంబాల్లో విషాయ ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరి తల్లుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల మనస్సులు తెలుసుకోకుండా తల్లిదండ్రులు పట్టుదలకు పోవడంతోనే ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?