టమోటాలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా ఫ్రెష్‌గా ఉండాల్సిందే!
26 July 2026
Anand T
చాలా సార్లు మనం మార్కెట్ నుంచి తెచ్చిన టమోటాలు ప్రిజ్‌లో పెట్టినప్పటికీ కొన్ని సార్లు పాడవుతాయి.కాబట్టి వాటిని తాజాగా ఉండేలా ప్రజ్‌లో ఎలా స్టోర్ చేయాలో తెలుసుకుందాం.
టమోటా స్టోరేజ్
టమోటాలను ఎప్పుడూ కూరగాయల కోసం కేటాయించిన ట్రేలోనే పెట్టాలి లేదంటే ఫ్రిజ్‌లోని చల్లదనం టమోటా కణాలను దెబ్బతిని అవి త్వరగా పాడవవచ్చు.
టమోటా స్టోరేజ్
మీరు టమోటాలను ఎప్పుడూ ప్లాక్టిక్ కవర్ లేదా.. గాలి చొరబడని డబ్బాలో పెట్టి స్టోర్ చేయరాదు.ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా పెరిగి టమోటాలు త్వరగా పాడవుతాయి.
టమోటా స్టోరేజ్
అందుకే టమోటాలను ఎల్లప్పుడూ వాటి కాడ భాగం కిందికి ఉండేలా ఒక కాగితంపై అమర్చి నిల్వ చేయడం ఉత్తమం.
టమోటా స్టోరేజ్
పచ్చి టమోటాలను ఫ్రిజ్‌లో పెడితే అవి పండే ప్రక్రియ ఆగిపోతుంది. దాంతో అవి రుచి, నాణ్యతను శాశ్వతంగా కోల్పోతాయి. కాబట్టి ఎప్పుడూ పచ్చి టమోటాలను ఫ్రిజ్‌లో పెట్టకండి
టమోటా స్టోరేజ్
టమోటాలను విడిగా ఉంచడమే మంచిది. మిగతా పండ్లు, కూరగాయలతో కలిపి ఉంచితే ఈథిలీన్ వాయువు వల్ల అవి త్వరగా పాడైపోతాయి.
టమోటా స్టోరేజ్
టమోటాలను కడిగి, తేమ ఆరకుండానే ఫ్రిజ్‌లో పెడితే బూజు పట్టి త్వరగా పాడవుతాయి.కాబట్టి ఆరిన తర్వాత మాత్రమే వాటిని ప్రిజ్‌లో పెట్టండి
టమోటా స్టోరేజ్
ఈ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వార మీరు వారం వరకు టమోటాలను తాజాగా ఉంచవ్చు. అయితే ఎంత జాగ్రత్తగా నిల్వ చేసినా, టమోటాలను ఒక వారం కంటే ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది.