మేకోవర్ టాపిక్.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్, నీల్
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా (NTR31) చుట్టూ అల్లుకున్న పుకార్లకు చిత్ర బృందం తెరదించింది. తారక్ కళరిపయట్టు నేర్చుకుంటున్నారనే వార్తలను, షూటింగ్ నిలిపివేశారనే ఊహాగానాలను ఖండించింది. షెడ్యూల్స్ అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయని, ఎటువంటి మేకోవర్ కోసం గ్యాప్ లేదని స్పష్టం చేసింది. అభిమానులు ఆందోళన చెందనవసరం లేదని, సినిమా ప్లాన్ ప్రకారం పురోగమిస్తోందని తెలిపింది.
రూమర్లు రాకపోతే ఆశ్చర్యపోవాలిగానీ, పెద్ద సినిమాల చుట్టూ రూమర్లుంటే ఆశ్చర్యం ఎందుకు? చాలా సందర్భాల్లో వాటిని చూసి సైలెంట్‌గా ఎంజాయ్ చేసే మేకర్స్ కొన్నిసార్లు మాత్రం రంగంలోకి దిగి… ఇదికాదురా బాబూ ఫ్యాక్ట్ అంటూ ఓపెన్‌గా చెప్పాల్సి వస్తోంది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ నీల్ అనౌన్స్ మెంట్ వచ్చినట్టు.. ఇంతకీ ఏంటది? తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ పలు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. తారక్ ఆల్రెడీ స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. సినిమాలో ఎన్ని రకాల లుక్స్ ఉంటాయి? గెటప్స్ ఉంటాయనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. దానికి ఫ్యూయల్ పోసినట్టు ఈ మధ్య మరో విషయం వైరల్ అయింది. నీల్ సినిమా కోసం తారక్ కళరిపయట్టు నేర్చుకుంటున్నారు అని. ఇవన్నీ సినిమా స్టార్ట్ కాకముందే చేసుకోవాలి కదా.. తీరా సినిమా మొదలుపెట్టాక షెడ్యూల్స్ ఆపి ఈ పనులు చేయడమెందుకు? అయినా ఇప్పుడు ఆ మార్షల్ ఆర్ట్స్ ఇంపార్టెన్స్ ఏంటి? అంటూ చర్చలు మొదలయ్యాయి. మీ అంతట మీరే ఊహించుకుని మేమేదో చేస్తున్నామని అనుకుంటే ఎలా? అన్న ఫీలింగ్ మేకర్స్ లో కనిపిస్తోంది. అందుకే వెంటనే క్లారిటీ ఇచ్చేశారు. వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. మేకోవర్ కోసమో, మరోదాని కోసమో షెడ్యూల్స్ ఆపలేదని చెప్పేసింది టీమ్. ఎన్టీఆర్ నీల్ సినిమా షెడ్యూల్స్ అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయి. అసలు దాని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. రెగ్యులర్ షూట్ గ్యాప్స్ మాత్రమే ఉన్నాయని క్లారిటీ ఇచ్చేశారు. సో, యాజ్ పర్ ప్లానింగ్ మూవీని ల్యాండ్ చేసే విషయంలో మేకర్స్ గురిగా ఉండటం ఆనందంగా ఉందంటున్నారు అభిమానులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్
‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ
TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా
Virat Kohli: ధురంధర్‌కి విరాట్ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్ ట్వీట్
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

