Ram Charan: శంకర్ తర్వాత మరో స్టార్ డైరెక్టర్ తో చరణ్ సినిమా.. గౌతమ్ తిన్ననూరి ప్లేస్ లోకి ఆ దర్శకుడు
ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా చరణ్ నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు చరణ్. రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా చరణ్ నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి.
గౌతమ్ తిన్ననూరి తేరైకెక్కించిన జెర్సీ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.దాంతో తన నెక్ట్స్ సినిమా గౌతమ్ తిన్ననూరి తో చేయాలనీ చరణ్ ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి గౌతమ్ తప్పుకున్నారని తెలుస్తోంది. కారణాలు తెలియదు కానీ చరణ్ సినిమా గౌతమ్ తిన్ననూరి చేయడం లేదని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే గౌతమ్ ప్లేస్ లో మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది.




చరణ్ శంకర్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో రంగస్థలం సినిమా ఒకటి. ఈ సినిమాలో చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు.చిట్టిబాబు పాత్రలో చెవిటి వాడిగా చరణ్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు చరణ్ సుకుమార్ తో సినిమా చేయనున్నారని టాక్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే చరణ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.