AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jahnvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్..

మిలి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న జాన్వీ తన తల్లి శ్రీదేవి బయోపిక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Jahnvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్..
Jahnvi Kapoor, Sridevi
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2022 | 2:03 PM

Share

దివంగత హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో జాన్వీకి హిందీలో అవకాశాలు క్యూకట్టాయి. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ.. ప్రస్తుతం మిలి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలోనే మిలి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న జాన్వీ తన తల్లి శ్రీదేవి బయోపిక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న జాన్వీ..శ్రీదేవి బయోపిక్ పై స్పందించింది. శ్రీదేవి బయోపిక్ తెరకెక్కిస్తే అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నారా ? అని విలేకరి అడగ్గా.. వెంటనే లేదు అని చెప్పేసింది. కారణం చెప్పాలని కోరగా.. సమాధానం చాలా పెద్దగా ఉంటుందని.. తాను ప్రస్తుతం ఈ వేదికపై ఏడవాలి అనుకోవడం లేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం జాన్వీ నటిస్తోన్న మిలి చిత్రంలో ఆమె నర్సుగా కనిపించనుంది. నర్సింగ్ గ్రాడ్యుయేట్ అయిన జాన్వీ ఓ కేఫ్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటుంది. అయితే ఓసారి మాల్ లోని కేఫ్ లో జాన్వీ ఫ్రీజర్ లో ఇరుక్కుపోతుంది.ఆమె తనను తాను కాపాడుకోవడం కోసం శరీరాన్ని డక్ట్ చేపుతో చుట్టుకుంటుంది. ఆ తర్వాత జాన్వీ ఆ ఫ్రీజర్ నుంచి ఎలా బయటపడింది అనేది కథ. ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. ఈ సినిమానే కాకుండా జాన్వీ మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?