Nani : పెద్ద ప్లానే..! నాని సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో పీపుల్ స్టార్..
న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరోకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్, అమ్మాయిల ఫ్యాన్స్ గురించి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా ఇష్టమైన హీరో.

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 సినిమాకోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. హిట్ సినిమాల సిరీస్ లో ఇప్పటివరకు విడుదలైన రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హిట్ 3 తో వస్తున్నారు. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ఓ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు నాని.
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. దసరా సినిమాతో తనకు భారీ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాకు ప్యారడైజ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. మరోసారి ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో అదరగొట్టనున్నాడు. అలాగే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుంది.
నా వల్ల అందరికి లాభం వచ్చింది.. నాకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు: హీరోయిన్
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ నటిస్తున్నారని తెలుస్తుంది. నాని ప్యారడైజ్ సినిమాలో పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి నటిస్తున్నారని తెలుస్తుంది. ప్యారడైజ్ సినిమాలో ఆర్ నారాయణ మూర్తి ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో టాప్ నాచ్ టెక్నిషియన్స్ తో పాటు పలువురు స్టార్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల ఆదివారం ఆర్. నారాయణ మూర్తిని కలిశారు. ఇందుకు సంబందించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ‘కామ్రేడ్’తో అంటూ ఆయనతో ఆ ఫోటోని షేర్ చేసాడు శ్రీకాంత్.
ఇదెక్కడి సినిమా రా మావ.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు.. అలాగే అంతకు మించి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.