Balakrishna: బాలయ్య దూకుడు.. ఆ సూపర్ హిట్ సీక్వెల్‌లో నటసింహం..
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారజ్. కొల్లి బాబీ దర్శకత్వంలో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటడు బాబీ డియోల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
![Balakrishna: బాలయ్య దూకుడు.. ఆ సూపర్ హిట్ సీక్వెల్‌లో నటసింహం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/balakrishna-20.jpg?w=1280)
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలకు సీక్వెల్ తెరకెక్కుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు కూడా సీక్వెల్స్ గా తెరకెక్కుతున్నాయి. కేజీఎఫ్, రీసెంట్ గా పుష్ప 2 సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఇక లోకల్ గాను చిన్న సినిమాలు గట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో హిట్ సినిమా కూడా ఒకటి. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ సినిమా 2020లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా హిట్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటించాడు.
హిట్ 2 సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలకు నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాని హీరోగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ 3 సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు హిట్ 4 సినిమా గురించి ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హిట్ 4లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే డాకు మహారాజ్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు బాలకృష్ణ. అఖండ , వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుస సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు హిట్ 4 సినిమాలో బాలకృష్ణ నటిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత హిట్ 4 సినిమాలో బాలకృష్ణ నటిస్తారా లేదా అన్నది క్లారిటీ వస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.