AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mokshgna Teja : బాలయ్య కొడుకా మజాకా..! తొలి సినిమాకే దిమ్మతిరిగే రెమ్యునరేషన్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం బాలకృష్ణ చాలా ప్లాన్ చేశారు. గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మా అబ్బాయ్ కూడా హీరోగా రాబోతున్నాడు.. యంగ్ హీరోల సలహాలు అతనికి కావాలి అని ఓ స్టేజ్ పై అన్నారు. అలాగే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ సీనియర్ దర్శకుడు తేజ డైరెక్షన్ లో ఉంటుందని గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ  ఆ ఛాన్స్ టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కు దక్కింది.

Mokshgna Teja : బాలయ్య కొడుకా మజాకా..! తొలి సినిమాకే దిమ్మతిరిగే రెమ్యునరేషన్
Mokshgna Teja
Rajeev Rayala
|

Updated on: Sep 12, 2024 | 1:07 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు వచ్చేస్తున్నాడు. నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక టైం వచ్చింది.. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే మోక్షజ్ఞా లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.  స్టార్ హీరోలను బీట్ చేసే స్టన్నింగ్ లుక్‌లో మోక్షజ్ఞ కనిపిస్తున్నాడు. మొన్నామధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలో సెట్ కు వెళ్లిన మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కత్తిలా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి లైన్ క్లియర్ అయ్యింది. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్‌తో కేకపెట్టించాడు మోక్షజ్ఞ.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం బాలకృష్ణ చాలా ప్లాన్ చేశారు. గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మా అబ్బాయ్ కూడా హీరోగా రాబోతున్నాడు.. యంగ్ హీరోల సలహాలు అతనికి కావాలి అని ఓ స్టేజ్ పై అన్నారు. అలాగే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ సీనియర్ దర్శకుడు తేజ డైరెక్షన్ లో ఉంటుందని గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ  ఆ ఛాన్స్ టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కు దక్కింది. సింబా అనే టైటిల్ తో మోక్షజ్ఞ సినిమాను తెరకెక్కించనున్నాడు ప్రశాంత్ వర్మ.

ఇది కూడా చదవండి :NTR : మా ఎన్టీఆర్‌నే అంటావా..! నువ్వే మాట్లాడాలి అందం గురించి.. యూట్యూబర్ పై మండిపడ్డ విశ్వక్

హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రశాంత్ ఇప్పుడు మోక్షజ్ఞ కోసం ఎలాంటి కథను రెడీ చేశాడు అని అందరిలో ఉత్కంఠ మొదలైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మోక్షజ్ఞ రెమ్యునరేషన్ కు సంబందించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తొలి సినిమాకు మోక్షజ్ఞ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నడని టాక్ వినిపిస్తుంది. ఫస్ట్‌ సినిమాకే 20 కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి బాలయ్య చిన్న కుమార్తె తేజశ్వని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.