NTR : మా ఎన్టీఆర్‌నే అంటావా..! నువ్వే మాట్లాడాలి అందం గురించి.. యూట్యూబర్ పై మండిపడ్డ విశ్వక్

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.

NTR : మా ఎన్టీఆర్‌నే అంటావా..! నువ్వే మాట్లాడాలి అందం గురించి.. యూట్యూబర్ పై మండిపడ్డ విశ్వక్
Devara
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2024 | 10:19 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో దేవర సినిమా పై అంచనాలు ఆకాశానికి చేరాయి.

ఇది కూడా చదవండి : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?

అయితే పెద్ద సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. నిజంగానే సినిమాలు, ట్రైలర్ లు బాలేకపోతే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం వేరు. కానీ కొంతమంది పనిగట్టుకొని పెద్ద సినిమాలు, టీజర్, ట్రైలర్ల పై నెగిటివ్ రివ్యూలు ఇస్తుంటారు. యూట్యూబ్‌లో ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. మీకు ట్రైలర్ నచ్చకపోతే ఓకే దాన్ని యూట్యూబ్ లో వీడియో చేసి పెట్టి.. ఇదిలా ఇలా చేయాలి. అది అలా ఉండాలి అంటూ వీడియోలు చేస్తే కొంతమందికి కోపం వస్తుంది. అలాగే ఇప్పుడు దేవర ట్రైలర్ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చిన యూట్యూబర్ పై హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

విశ్వక్ కు తారక్ అంటే చాలా ఇష్టం.. అయితే తాజాగా విడుదలైన దేవర ట్రైలర్ పై ఓ యూట్యూబర్ నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. ట్రైలర్ మీద, ఎన్టీఆర్ లుక్స్ మీద యూట్మూబర్లు ఇద్దరు ట్రోలింగ్ చేశారు. ఈ మేరకు ఆ ఇద్దరూ  మాట్లాడుకుంటూ.. ట్రైలర్ చూడబుద్ది కాలేదని ఒకరు అంటే.. ట్రైలర్ ఏమంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, నచ్చలేదని ఇంకొకరు అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ లుక్స్ మీద సైతం కామెంట్లు చేశారు. దాంతో విశ్వక్ సేన్ కు కోపం వచ్చింది .. నిజానికి వాళ్ల మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరికైనా మండుతుంది. దాంతో ఆ ఇద్దరినీ విశ్వక్ ఏకిపారేశారు.  ముందు నువ్వు ఆ గోడ సాయం లేకుండా 2 నిముషాలు నిల్చొండి ఆ తర్వాత మాట్లాడుకుందాం. అయినా నాకు కాలిపోతుంది నిన్ను చూస్తుంటే.. ఏమైనా చేద్దామంటే.. మీ మొహం కాలిపోయినట్టే ఉంది ఏం చేస్తాం.. ఇక మీరే అందం గురించి మాట్లాడుకోవాలి అంటూ ఫైర్ అయ్యాడు విష్వక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.