Bigg Boss Telugu: నాగ్ ప్లేస్‌ను రీప్లేస్ చేయనున్న మంచు హీరో..? బిగ్ బాస్ సీజన్ 7కు హోస్ట్‌గా..
తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సీజన్ కు భారీ టీఆర్పీ వచ్చింది. తారక్ తనదైన స్టైల్ లో ఈ గేమ్ షోను హోస్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత సీజన్ 2 కు నేచురల్ స్టార్ నాని..
వరల్డ్స్ బిగెస్ట్ టెలివిజన్ గేమ్ షో బిగ్ బాస్ తెలుగులో వరుస సీజన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్స్ ను పూర్తి చేసుకుంది ఈ గేమ్ షో. అయితే తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సీజన్ కు భారీ టీఆర్పీ వచ్చింది. తారక్ తనదైన స్టైల్ లో ఈ గేమ్ షోను హోస్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత సీజన్ 2 కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు. తారక్ అంత కాకపోయినా నాని బాగానే మ్యానేజ్ చేశారు ఆ సీజన్ ను. ఆ తర్వాత నుంచి బిగ్ బాస్ బాధ్యతలను భుజాన వేసుకున్నారు కింగ్ నాగార్జున. సీజన్ 3 నుంచి మొన్నటి సీజన్ 6వరకు నాగ్ హోస్ట్ గా వ్యవహరించారు, అయితే అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే సీజన్ 6 కు అనుకున్నంత ప్రేక్షకాదరణ దక్కలేదు. పైగా నెగిటివిటీ కూడా ఎక్కువైపోయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ 7 నుంచి కింగ్ నాగార్జున తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే నాగార్జున ప్లేస్ లో ఎవరు బిగ్ బాస్ సీజన్ 7 ను హోస్ట్ చేస్తారు అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపించింది. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది.
ఇటీవలే అన్ స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బాలయ్య బిగ్ బాస్ 7కూడా హోస్ట్ చేస్తారని టాక్ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో హీరో పేరు తెరమీదకొచ్చింది. బిగ్ బాస్ 7కు మంచు ఫ్యామిలీ హీరో హోస్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ హీరో ఎవరోకాదు మంచు విష్ణు . బిగ్ బాస్ సీజన్ 7 ను మంచు విష్ణు హోస్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి, మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవలే జిన్నా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు విష్ణు. అలాగే మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.