Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top Gear Telugu movie review: థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ‘టాప్‌గేర్‌’

ఆది సాయికుమార్‌ ఇందులో హీరోగా నటించారు. నటన, డ్యాన్సులు, ఫైట్లు అన్నీ చేయగల సత్తా ఉన్న ఆదిసాయికుమార్‌కి సరైన హిట్‌ పడితే చూడాలన్నది చాలా మంది కోరిక. మరి టాప్‌గేర్‌తో ఆయనకు హిట్‌ వచ్చినట్టేనా?

Top Gear Telugu movie review: థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో 'టాప్‌గేర్‌'
Top Gear
Follow us
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Rajitha Chanti

Updated on: Dec 30, 2022 | 12:59 PM

ఇయర్‌ ఎండింగ్‌కి వచ్చేశాం. ఇంకొక్కరోజు ఆగితే కొత్త సంవత్సం పలకరిస్తుంది. 2022 ఆఖరి వీకెండ్‌ రిలీజ్‌ అయిన సినిమాల్లో ఉంది టాప్‌గేర్‌. ఆది సాయికుమార్‌ ఇందులో హీరోగా నటించారు. నటన, డ్యాన్సులు, ఫైట్లు అన్నీ చేయగల సత్తా ఉన్న ఆదిసాయికుమార్‌కి సరైన హిట్‌ పడితే చూడాలన్నది చాలా మంది కోరిక. మరి టాప్‌గేర్‌తో ఆయనకు హిట్‌ వచ్చినట్టేనా?

సినిమా: టాప్‌ గేర్‌

నిర్మాణ సంస్థ: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్

ఇవి కూడా చదవండి

సమర్పణ: ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్

నటీనటులు: ఆది సాయికుమార్‌, రియా సుమన్‌, బ్రహ్మాజీ, సత్యం రాజేష్‌, చమ్మక్‌ చంద్ర, శత్రు, మిర్చి హేమంత్‌, మైమ్‌ గోపీ తదితరులు

నిర్మాత: కె.వి.శ్రీధర్‌ రెడ్డి

దర్శకత్వం: శశికాంత్‌

సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌

కెమెరా: సాయిశ్రీరామ్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి

ఆర్ట్: రామాంజనేయులు

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గిరిధర్‌ మామిడిపల్లి

అర్జున్‌ (ఆది సాయికుమార్‌) క్యాబ్‌ డ్రైవర్‌. అతని భార్య ఆద్య (రియా సుమన్‌). అందంగా సాగిపోయే ఫ్యామిలీ వాళ్లది. ఓ రోజు భార్య పుట్టినరోజని త్వరగా ఇంటికి వెళ్లాలనుకుంటాడు అర్జున్‌. సరిగా ఆ టైమ్‌లో అర్జున్‌ క్యాబ్‌లో కొందరు ట్రావెల్‌ చేస్తారు. వాళ్ల మధ్య ఏవో లావాదేవీలు జరుగుతాయి. అనుకోకుండా వాళ్లను ఎవరో చంపుతారు. వాళ్ల చేతిలో ఉన్న బ్యాగ్‌ డేవిడ్‌ కి చేరుతుంది. ఇదంతా తెలిసిన సిద్ధార్థ్‌ (మైమ్‌ గోపీ) సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. బ్యాగ్‌ తీసుకొచ్చి ఇచ్చి, భార్యను తీసుకెళ్లమని అర్జున్‌కి చెబుతాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు డేవిడ్‌ ఎవరు? ముంబైలో సిద్ధార్థ్‌ ఏం చేసేవాడు? అతనికి, రాజుకి ముంబైలో ఆల్రెడీ పరిచయం ఉందా? ఖాసిం ఎవరు? డ్రగ్స్ డీల్‌ చేసిన వ్యక్తి ఎవరు? వీళ్లందరికీ పరిచయం ఏంటి? అసలు తనది కాని సమస్యలో అర్జున్‌ ఎలా ఇరుక్కున్నాడు? సుబ్బారావు వేసిన స్కెచ్‌లో నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది ఆసక్తికరం.

అర్జున్‌ కేరక్టర్‌లో పర్ఫెక్ట్ గా ఫిట్‌ అయ్యారు ఆది సాయికుమార్‌. అందమైన ఇల్లు, కోరుకున్న జీవితాన్ని సరదాగా గడిపే యువకుడిగా మెప్పించారు. తనకంటూ ఓ సమస్య వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి అంతే నిజాయతీగా కష్టపడే యువకుడిగా మెప్పించారు. విలన్‌ కేరక్టర్‌లో మైమ్‌గోపీ యాజ్‌ ఇట్‌ఈజ్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఏసీపీగా శత్రు కేరక్టర్‌ బావుంది. ఒక రోజులో జరిగే కథలో డేవిడ్‌ ఎవరు? అనే సస్పెన్స్ ని చాలా బాగా క్యారీ చేశారు.

సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బావుంది డైలాగులు కథలో భాగంగా నేచురల్‌గా ఉన్నాయి. హైదరాబాద్‌లోని రోడ్లను, లొకేషన్లను లైట్ల వెలుగుల్లో అందంగా చూపించే ప్రయత్నం చేశారు. కెమెరా వర్క్ బావుంది. ఛేజింగ్‌ ప్రధానంగా సాగే థ్రిల్లర్‌ కావడంతో అనవసరమైన కామెడీకి, పాటలకు చోటు కల్పించలేదు. సినిమాకు అత్యంత పెద్ద ప్లస్‌ పాయింట్‌ అదే అయింది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ నేపథ్య సంగీతం బావుంది. ఫస్ట్ హాఫ్‌ని కట్‌ చేసినంత షార్ప్ గా సెకండ్‌ హాఫ్‌ని కూడా కట్‌ చేసి ఉంటే బావుండేది. సెకండ్‌ హాఫ్‌లో కాస్త ల్యాగ్‌లు ఎక్కువైన ఫీలింగ్‌ కలుగుతుంది. శశికాంత్‌ డైరక్టర్‌గా క్లిక్‌ అయినట్టే. టాప్‌ గెయిర్‌ ఈ ఏడాది డీసెంట్‌ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఆది సాయికుమార్‌కి ఈ ఇయర్‌ ఎండింగ్‌ పాజిటివ్‌ వైబ్స్ తెచ్చిపెట్టాయి. థ్రిల్లర్లను ఇష్టపడేవారికి నచ్చుతుంది టాప్‌ గెయిర్‌. – డా. చల్లా భాగ్యలక్ష్మి