AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ‘సింగిల్‏గా ఉండను.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. కానీ’.. మళ్లీ అయోమయంలో పడేసిన ప్రభాస్..

ఇటీవల డార్లింగ్..బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారని వార్తలు రాగా.. తామిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది కృతి. ఇక ఇదే విషయాన్ని ప్రభాస్ సైతం అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చారు డార్లింగ్. మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని..

Prabhas: 'సింగిల్‏గా ఉండను.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. కానీ'.. మళ్లీ అయోమయంలో పడేసిన ప్రభాస్..
Prabhas Marriage
Rajitha Chanti
|

Updated on: Dec 30, 2022 | 12:10 PM

Share

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఇప్పటికే డార్లింగ్ పెళ్లి గురించి అనేక వార్తలు వినిపించాయి. రాజమౌళి రూపొందించిన బాహుబలి 2 తర్వాత మ్యారెజ్ చేసుకుంటానని చెప్పిన ప్రభాస్.. ఇప్పటివరకు మళ్లీ పెళ్లి గురించి మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్ ను చూసి.. ఇక పెళ్లి చేసుకునేదెప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల డార్లింగ్..బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారని వార్తలు రాగా.. తామిద్దరం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది కృతి. ఇక ఇదే విషయాన్ని ప్రభాస్ సైతం అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చారు డార్లింగ్. మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని.. ఏం లేకుండానే అంత గోల చేస్తున్నారని.. ఇప్పటికే కృతి కూడా క్లారిటీ ఇచ్చిందని మరోసారి గుర్తుచేసారు. అయితే ఈ షోలో ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ మాత్రం వచ్చిందనుకుంటున్న అభిమానులను తన మాటలతో మరోసారి కన్ఫ్యూజ్ చేశారు.

ఇటీవల బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొన్న ప్రభాస్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 29న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో బాలయ్య ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకుంటావా.. లేదా ” అని గట్టిగా ప్రశ్నించారు. ఇందుకు డార్లింగ్ స్పందిస్తూ.. పెళ్లి చేసుకుంటాను సార్.. కచ్చితంగా చేసుకుంటాను. కానీ ఇంకా రాసిపెట్టలేదేమో.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. సింగిల్ గా మాత్రం ఉండను.. కానీ ఎప్పుడనేది చెప్పలేను అంటూ సరాదాగా చెప్పుకొచ్చారు డార్లింగ్. దీంతో తమ హీరో మాటలకు బాలయ్యతోపాటు.. ఫ్యాన్స్ కూడా అయోమయంలో పడ్డారు. పెళ్లి చేసుకుంటాను.. కానీ ఎప్పుడో తెలియదు.. ప్రేమలో ఉన్నావా అంటే అలాంటిదేం లేదు అంటూ మాట దాటేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. త్వరలోనే డార్లింగ్ ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ హింట్ ఇవ్వడంతో ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం చిన్న క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది బాహుబలి పెళ్లిపీటలెక్కడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

టమాట ఈ కూరల్లో వేయకపోవడమే మంచిది.. ఎందుకంటే
టమాట ఈ కూరల్లో వేయకపోవడమే మంచిది.. ఎందుకంటే
JEE Main 2026ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్షల తేదీలివే
JEE Main 2026ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్షల తేదీలివే
డబ్ల్యూపీఎల్ ఫైనల్లో స్మృతి ట్రిపుల్ మిషన్ కంప్లీట్ అవుతుందా ?
డబ్ల్యూపీఎల్ ఫైనల్లో స్మృతి ట్రిపుల్ మిషన్ కంప్లీట్ అవుతుందా ?
మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు