Prabhas: ఇన్‌స్టాలో కేవలం 16 మందినే ఫాలో అవుతున్న ప్రభాస్.. వారెవరో మీరు గెస్ చేయగలరా..?

బాహుబలి ఫేమ్ ప్రభాస్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించడు. కానీ అతన్ని ఫాలో అయ్యేవారి సంఖ్య మాత్రం రోజురోజకు పెరుగుతూ పోతుంది.

Prabhas: ఇన్‌స్టాలో కేవలం 16 మందినే ఫాలో అవుతున్న ప్రభాస్.. వారెవరో మీరు గెస్ చేయగలరా..?
Prabhas
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2022 | 4:42 PM

టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోగా కన్నా తన వ్యక్తిత్వంతో ఎక్కువమంది హృదయాలను గెలుచుకున్నాడు ప్రభ. అభిమానులను అతను చూసుకునే విధానం, ఫ్యాన్స్ అతనిపై చూపించే ప్రేమ.. నెక్ట్స్ లెవల్ అంతే. తెలుగు నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరో అయినా కూడా అతనిలో కొంచెం కూడా మార్పు లేదు. తాజాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చాడు ప్రభాస్. డార్లింగ్ ఫ్యాన్స్ తాకిడికి.. ఆహా సైట్ క్రాస్ అయింది అంటే అతని ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో చాలా రేర్‌గా పోస్టులు పెట్టే ప్రభాస్‌కి ఫాలోవర్స్ మాత్రం దండిగా ఉన్నారు. ఏకంగా 9 మిలియన్ల మంది అంటే 90 లక్షల మంది ప్రభాస్‌ను ఇన్‌స్టాలో అనుసరిస్తున్నారు.

అయితే ప్రభాస్‌ మాత్రం కేవలం 16 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఈ విషయం మీరు పెద్దగా గమనించి ఉండరు. డార్లింగ్ ఫాలో అవుతున్న ఆ 16 మంది స్పెషల్ పర్సన్స్ ఎవరో తెలుసుకుందాం పదండి. ఎక్కువమంది అయితే తన సినిమాల డైరెక్టర్స్, కో సార్ట్స్ మాత్రమే ఉన్నారు.

  1. దివంగత కృష్ణం రాజు గారు
  2. సందీప్ రెడ్డి వంగ
  3. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్
  4. హీరోయిన్ క్రితీ సనన్
  5. ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్  DB బ్రాకమోంటెస్
  6. డైరెక్టర్ నాగ్ అశ్విన్
  7. డైరెక్టర్ రాధాకృష్ణ
  8. హీరోయిన్ శృతిహాసన్
  9. ప్రశాంత్ నీల్
  10. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్
  11. డైరెక్టర్ ఓం రౌత్
  12. హీరోయిన్ దీపికా పదుకొనే
  13. నటి భాగ్య శ్రీ
  14. హీరోయిన్ పూజా హెగ్డే
  15. హీరోయిన్ శ్రద్ధా కపూర్
  16. డైరెక్టర్ సుజీత్

ఇందులో ఎక్కువ మంది తన సినిమాలకు పని చేసిన క్యాస్ట్ అండ్ క్రూ పర్సన్స్ మాత్రమే ఉన్నారు. అనూహ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోలు చరణ్, తారక్, బన్నీ లాంటి వారిని ప్రభాస్ ఫాలో అవ్వడం లేదు. కేవలం తనతో వర్క్ చేసే వారినే ఫాలో అవ్వాలని ప్రభాస్ ఏమైనా రూల్ పెట్టుకున్నాడేమో..!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.