AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమాకు నా పోస్టర్ కూడా వేయలేదు..! కానీ స్టార్ హీరో నన్ను, నా పాత్రను పొగిడారు

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న థియేటర్ లో రిలీజ్ అవుతుంది.

ఆ సినిమాకు నా పోస్టర్ కూడా వేయలేదు..! కానీ స్టార్ హీరో నన్ను, నా పాత్రను పొగిడారు
Naveen Chandra
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2026 | 8:10 PM

Share

తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు తమ ప్రతిభను చాటుకుంటూ దూసుకుపోతున్నారు వారిలో నవీన్ చంద్ర ఒకరు. హీరో, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగలడు నవీన్ చంద్ర. యాక్టింగ్ లో ఆల్ రౌండర్ అనిపించుకుంటోన్న ఈ నటుడు ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ గా అదరగొడుతున్నాడు నవీన్ చంద్ర. ప్రస్తుతం నవీన్ చంద్ర హనీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినిమా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు నవీన్ చంద్ర. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ చంద్ర మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాజాగా నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అరవింద సమేత చిత్రం విడుదలకు ముందు నవీన్ చంద్ర తన పాత్ర పోస్టర్‌లో లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ సమయంలో తన పోస్టర్స్ ఎక్కడా లేకపోవడంతో.. తన క్యారెక్టర్‌కు అంత ప్రాముఖ్యత లేదేమోనని ఆయన భావించారట. సినిమాలో విలన్ పాత్ర అయినప్పటికీ.. ఎడిటింగ్ లో తీసేస్తారేమో అనుకున్నా అని నవీన్ అన్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా మైక్‌లో తన పాత్రను ఉద్దేశిస్తూ ” సినిమాలో నా క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్, హి ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్” అని చెప్పినప్పుడు, నవీన్ చంద్ర తన పాత్ర విలువను అర్థం చేసుకున్నా అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో నుంచి అలాంటి ప్రశంసలు రావడం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, గుర్తింపును ఇచ్చిందని నవీన్ చంద్ర తెలిపారు. పోస్టర్లలో కనిపించకపోయినా, ఎడిటింగ్ లో తన సన్నివేశాలను ఉంచుతారా లేదా అనే విషయంలో సందేహాలు ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ మాటలు తనకు అపారమైన సంతృప్తినిచ్చాయి. ఈ అనుభవం తర్వాత, నవీన్ చంద్ర తన తదుపరి చిత్రాలలో మరింత ప్రముఖమైన, ఫ్రంట్ లైన్ పాత్రలు చేయాలని ఫిక్స్ అయ్యారట. తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించేలా కృషి చేస్తానని నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us