Sreeleela : డీజే టిల్లు సీక్వెల్ విషయంలో జరిగింది ఇదే.. అసలు విషయం చెప్పిన శ్రీలీల

కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి లీల తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ అమ్మడి అందానికి చెలకీ తనానికి కుర్రాళ్లంతా ఫిదా.. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అంటూ కుర్రకారు అంతా శ్రీలీలకు గుండెల్లో గుడి కట్టేస్తున్నారు.

Sreeleela : డీజే టిల్లు సీక్వెల్ విషయంలో జరిగింది ఇదే.. అసలు విషయం చెప్పిన శ్రీలీల
Sreeleela
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 30, 2022 | 3:55 PM

టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి లీల తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ అమ్మడి అందానికి చెలకీ తనానికి కుర్రాళ్లంతా ఫిదా.. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అంటూ కుర్రకారు అంతా శ్రీలీలకు గుండెల్లో గుడి కట్టేస్తున్నారు. రీసెంట్ గా ధమాకా సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో శ్రీలీలకు ఆఫర్లు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. యంగ్ హీరోలంతా ఈక్యూటీ కోసం క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ అమ్మడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్న వార్త చక్కర్లు కొట్టింది. ఈ ఇయర్ విడుదలైన సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచింది డీజే టిల్లు. సిద్దూజొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎపిక చేసిన హీరోయిన్స్ ఒకొక్కరిగా ఆ మూవీ నుంచి తప్పుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీలీల పేరు కూడా వినిపించింది. కొద్దిరోజులు షూటింగ్ చేసిన తర్వాత శ్రీలీల ఈ మూవీ నుంచి తప్పుకుందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయం పై శ్రీలీల స్పందించింది.

ఇవి కూడా చదవండి

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ.. అది కేవలం రూమర్ మాత్రమే అని కొట్టిపారేసింది. తాను ఆసినిమాను ఒప్పుకోలేదని. ఏదైనా సినిమా ఓకే చేస్తే నేను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటానని తెలిపింది. దాంతో డీజీ టిల్లు సినిమా నుంచి శ్రీలీల తప్పుకుంది అన్నది కేవలం రూమర్ మాత్రమే అని తేలిపోయింది. ఇక శ్రీలీల ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తుందో. అలాగే మహేష్ త్రివిక్రమ్ సినిమాలో కూడా నటిస్తుందని టాక్.