AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క గ్రాముతో వందల కేజీల బంగారం కొనొచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం ఇదే..

ప్రకృతిలో లభించే వజ్రాలు, వైఢూర్యాలే ఖరీదైనవి అనుకుంటే పొరపాటే. సైన్స్ సృష్టించిన ఒక కృత్రిమ మూలకం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువుగా రికార్డు సృష్టించింది. ఒక గ్రాము విలువ అక్షరాలా 239 కోట్ల రూపాయలు. అణు రియాక్టర్లలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ ద్వారా తయారయ్యే ఈ లోహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకే ఒక్క గ్రాముతో వందల కేజీల బంగారం కొనొచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం ఇదే..
Most Expensive Metal In The World
Krishna S
|

Updated on: Feb 05, 2026 | 11:11 AM

Share

ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులకు ఇవి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అయితే ప్రపంచంలో బంగారం కంటే కొన్ని లక్షల రెట్లు ఖరీదైన లోహం ఒకటి ఉందని మీకు తెలుసా? దాని పేరు కాలిఫోర్నియం. దీని ధర వింటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఒక గ్రాము కాలిఫోర్నియం కొనాలంటే ఏకంగా 200 కిలోల బంగారం అమ్మాల్సిందే. అవును..కాలిఫోర్నియం అనేది బంగారం లేదా వెండి లాగా భూమిలో సహజంగా దొరికే లోహం కాదు. ఇది ఒక సింథటిక్ మూలకం. 1950లో అమెరికాలోని బర్కిలీలో ఉన్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిని ల్యాబ్‌లో సృష్టించారు. అందుకే దీనికి ఆ రాష్ట్రం పేరు మీదగా కాలిఫోర్నియం అని పేరు పెట్టారు.

ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంది?

ఒక గ్రాము కాలిఫోర్నియం ధర సుమారు 27 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 239 కోట్లు. దీనిని అణు రియాక్టర్లలో ఇతర మూలకాలను న్యూట్రాన్లతో సుదీర్ఘ కాలం ఢీకొట్టించడం ద్వారా తయారు చేస్తారు. ప్రపంచంలో కేవలం కొన్ని దేశాల్లో, కొన్ని ల్యాబ్‌లలో మాత్రమే దీనిని తయారు చేసే సాంకేతికత ఉంది. ఇది అత్యంత శక్తివంతమైన రేడియోధార్మిక మూలకం. దీనిని నిల్వ చేయడం, రవాణా చేయడం అత్యంత క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ.

దీని వల్ల ఉపయోగాలు ఏంటి?

ఇంత ఖరీదైన లోహాన్ని ఆభరణాల తయారీలో అస్సలు వాడరు. దీని వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి..

క్యాన్సర్ చికిత్స: ఇతర చికిత్సలు పని చేయని సమయంలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే న్యూట్రాన్ థెరపీలో కాలిఫోర్నియం-252ను ఉపయోగిస్తారు.

అణు పరిశ్రమ: అణు రియాక్టర్లను ప్రారంభించడానికి ఇది స్టార్టర్‌గా పనిచేస్తుంది.

అంతరిక్ష పరిశోధన: అంతరిక్ష నౌకల్లోని పరికరాల పరీక్షల్లో దీనిని వాడతారు.

భద్రత: గనుల్లో బంగారం, వెండి నిల్వలను గుర్తించడానికి, చమురు బావుల అన్వేషణలో దీని పాత్ర కీలకం.

Follow Us
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
భారీ రెమ్యునరేషన్ తో 'బిగ్‌బాస్' ఆఫర్ వచ్చింది: జబర్దస్త్ బ్యూటీ
భారీ రెమ్యునరేషన్ తో 'బిగ్‌బాస్' ఆఫర్ వచ్చింది: జబర్దస్త్ బ్యూటీ
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి..
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి..