తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో రెండేళ్లకు ఒకసారి సత్యమ్మ తల్లి జాతర భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. ఈ జాతరలో భక్తులు, కోటీశ్వరులతో సహా, విచిత్ర వేషధారణలతో భిక్షాటన చేసి, సేకరించిన సొమ్మును అమ్మవారికి సమర్పిస్తారు. పూజారుల బెత్తం దెబ్బలను సైతం ఆశీర్వాదంగా భావించి మొక్కులు చెల్లించుకుంటారు.