Koratala Siva: మరోసారి ఆ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తోన్న కొరటాల శివ..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ పేరు కూడా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అన్ని సూపర్ హిట్స్ సాధించడంతో కొరటాల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ పేరు కూడా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అన్ని సూపర్ హిట్స్ సాధించడంతో కొరటాల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ ఆతర్వాత మహేష్ తో శ్రీమంతుడు, భరత్ అనే నేను, తారక్ తో జనతా గ్యారేజ్ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాలు చేశారు. వీటిలో ఆచార్య సినిమా తప్ప మిగిలినవన్నీ మంచి హిట్స్ గా నిలిచాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా మాత్రం నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్య బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇక ఇప్పుడు తారక్ తో సినిమా చేస్తున్నాడు కొరటాల. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కొరటాల సినిమా చేసే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే కొరటాల శివ ప్రభాస్ తో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాలకు ప్రభాస్ మరో అవకాశం ఇచ్చారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రొజెట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. డార్లింగ్ లైనప్ చేసిన సినిమాలు పూర్తవ్వాలంటే కనీసం రెండేళ్లు పట్టింది. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రభాస్ కొరటాల కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.