సూర్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ఈ నటుడికి భారీగా అభిమానులు ఉన్నారు. అయితే గత కొన్నేళ్ల నుంచి సూర్యకు సరైన హిట్ పడడం లేదు. అతను చేస్తోన్న సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. అయితే తన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరడం లేదు.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రం మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత, సూర్య తన 45 చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా.. త్రిష నటిస్తుంది. సూర్య, త్రిష ఇద్దరూ ఈ సినిమాలో న్యాయవాదులుగా కనిపించనున్నారు. ఆసక్తికర కథతో ఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది
ఈ సినిమా తర్వాత సూర్య తమిళ చిత్రం వాడివాసల్ లో నటించనున్నాడని తెలిసిందే. వీటితో పాటు లక్కీ భాస్కర్, సార్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయనున్నారు సూర్య. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనలు త్వరలో వెలువడతాయని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి కొలువుడ్ లో ఆసక్తికర టాక్ నడుస్తుంది. ఇంకా అనౌన్స్ కానీ ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి కూడా ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.
ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్
ఈ చిత్రంలో నటి మమిత బైజు కూడా ఒక ప్రధాన పాత్రలో నటించనుంది. వీరిద్దరూ గతంలో దర్శకుడు బాలా దర్శకత్వం వహించిన వనంగాన్ చిత్రంలో నటించారు. కానీ ఆ సినిమా నుంచి అనివార్యకారణాల వల్ల సూర్య, మమిత ఇద్దరూ తప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు సూర్య సతీమణి జ్యోతిక.. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సూర్య, జ్యోతిక కలిసి నటిస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. సూర్య, జ్యోతిక కలిసి నటించనున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








