Kalki 2898 AD: అంచనాలు పెంచేస్తున్న నాగ్ అశ్విన్.. ప్రభాస్ కల్కీ సినిమాలో ఆ యంగ్ హీరో కూడా..
రుసగా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో కల్కీ, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ వంగ తో స్పిరిట్ ఇలా వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో గ్యాప్ లేకుండా గడిపేస్తున్నారు ప్రభాస్. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా సలార్, కల్కి మూవీస్ నుంచి గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇప్పటికీ ఈ రెండు వీడియోలు ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఏడాదికి మూడు సినిమాలు చేస్తా అని మాటించిన డార్లింగ్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. వరుసగా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో కల్కీ, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ వంగ తో స్పిరిట్ ఇలా వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో గ్యాప్ లేకుండా గడిపేస్తున్నారు ప్రభాస్. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా సలార్, కల్కి మూవీస్ నుంచి గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇప్పటికీ ఈ రెండు వీడియోలు ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.
సలార్, కల్కీ సినిమాల పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కీ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. డార్లింగ్ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారు నాగ్ అశ్విన్. మొన్నామధ్య విడుదలైన వీడియో హాలీవుడ్ రేంజ్ లో ఉంది. 2898లో ప్రపంచం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కల్కీ సినిమాలో ఓ యంగ్ హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే నాగ్ అశ్విన్ దుల్కర్ తో సంప్రదింపులు కూడా చేశారని టాక్. గతంలో నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటి సినిమాలో దుల్కర్ నటించిన సంగతి తెలిసిందే. కల్కీ సినిమాలో ఓ కీ రోల్ కు దుల్కర్ అయితే కరెక్ట్ గా సూట్ అవుతాడని నాగి భావిస్తున్నారట. త్వరలోనే దీని పై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక కల్కీ సినిమాలో స్టార్ కాస్ట్ నటిస్తున్న విషయం తెలిసిందే.
దుల్కర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
View this post on Instagram
ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తుండగా .. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
𝐏𝐑𝐎𝐉𝐄𝐂𝐓-𝐊 is now #Kalki2898AD 💥
Here’s a small glimpse into our world: https://t.co/3vkH1VpZgP#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
కల్కీ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
Comic-Con 2023 : The Journey from #ProjectK to #Kalki2898AD ♥️✨
– https://t.co/JiNzHAoUXy#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/A7yTKCfdSv
— Kalki 2898 AD (@Kalki2898AD) August 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.