AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అఖిల్ విధ్వంసం సృష్టించనున్నాడా ?.. పవర్ ఫుల్ వైల్డ్ లుక్‏లో అంచనాలు పెంచేసిన అక్కినేని హీరో..

ఈ మూవీతో విజయాన్ని అందుకున్న అఖిల్.. ఆతర్వాత స్పీడ్ పెంచారు. వెంటనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం అఖిల్ తన మేకోవర్ మొత్తాన్ని మార్చేశారు.

Akhil Akkineni: పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అఖిల్ విధ్వంసం సృష్టించనున్నాడా ?.. పవర్ ఫుల్ వైల్డ్ లుక్‏లో అంచనాలు పెంచేసిన అక్కినేని హీరో..
Akhil Akkineni
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2023 | 1:49 PM

Share

అఖిల్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు అక్కినేని అఖిల్. అయితే మొదటి సినిమాతోనే డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఈ హీరో నటించిన అన్ని చిత్రాలు అంతంతమాత్రంగానే ప్రేక్షకులను అలరించాయి. దీంతో సినిమా సెలక్షన్స్ పై ఫోకస్ పెట్టారు అఖిల్. తన తదుపరి చిత్రాల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా అచి తుచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కంటెంట్ ప్రాధాన్యతకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో విజయాన్ని అందుకున్న అఖిల్.. ఆతర్వాత స్పీడ్ పెంచారు. వెంటనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం అఖిల్ తన మేకోవర్ మొత్తాన్ని మార్చేశారు.

వీరిద్దరి కాంబోలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ మేకింగ్ వీడియోను విడుదల చేసి ఏజెంట్‌ని వేసవిలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తాజా అప్‌డేట్ ఏమిటంటే ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా హాలిడే సీజన్‌లో క్యాష్ చేసుకోబోతోంది. అలాగే పాన్ ఇండియా రిలీజ్ కోసం సమ్మర్ బెస్ట్ సీజన్.

ఇవి కూడా చదవండి

వైల్డ్ యాక్షన్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. అఖిల్‌ని కుర్చీకి కట్టేసి, తలకు మాస్క్‌ కప్పారు. అతను పని చేస్తున్న ఏజెన్సీ గురించి అడిగినప్పుడు, “ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్” అని సమాధానమిచ్చాడు. ముఖం అంతా రక్తంతో నిండి.. తనని తాను వైల్డ్ సాలే పిలవడం క్యూరియాసిటీ పెంచింది.

విడుదల తేదీ గ్లింప్స్ చాలా వైల్డ్ గా ఉంది . అఖిల్ పాత్ర యొక్క వైల్డ్ సైడ్‌ను ప్రజంట్ చేసింది. అఖిల్ ఈ చిత్రంలో పొడవాటి, గిరజాల జుట్టుతో విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం స్టైలిష్ మేక్ఓవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ అబ్స్‌తో కనిపిస్తాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఇతర స్పై థ్రిల్లర్‌లకు పూర్తి భిన్నంగా రూపొందించారు. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తోంది. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమరామెన్ గా పని చేస్తుండగా, హిప్ హాప్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.