- Telugu News Photo Gallery Cinema photos Actress Anika Surendran Thanks To Audiance for butta bomma success telugu cinema news
Anika Surendran: హీరోయిన్గా సక్సెస్ అందుకున్న అజిత్ రీల్ కూతురు.. ప్రశంసలు అందుకుంటున్న అనిక సురేంద్రన్..
అనిక సురేంద్రన్... తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పుడు కథానాయికగా ఆమె నటించిన సినిమా బుట్టబొమ్మ. నూతన దర్శకుడు చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు.
Updated on: Feb 05, 2023 | 1:50 PM

అనిక సురేంద్రన్... తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పుడు కథానాయికగా ఆమె నటించిన సినిమా బుట్టబొమ్మ. నూతన దర్శకుడు చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఫిబ్రవరి 4న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ అనిక సురేంద్రన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో కథానాయికగా మెప్పించింది అనిక. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్.

ఈ వేడుకలో అనిక సురేంద్రన్ పాల్గొన్నారు. "మలయాళ సూపర్ హిట్ మూవీ కప్పేలా కి రీమేక్ గా వచ్చిన మా బుట్టబొమ్మ మూవీ మీ అందరినీ ఎంతో అలరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు అనిక..

ఈ సినిమా కోసం తనను ఎంపిక చేసిన నిర్మాత నాగవంశీ.. సాయి సౌజన్యకు.. డైరెక్టర్ చంద్రశేఖర్ రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో తనకు సూర్య , అర్జున్ దాస్ ఇద్దరూ చాలా సపోర్ట్ చేశారని.. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అయితే బుట్టబొమ్మ సినిమా సక్సెస్ తో తెలుగులో అనికకు కాస్త్ ఎక్కువగానే అవకాశాలు వచ్చేట్టుగా తెలుస్తోంది. చూడాలి మరీ హీరోయిన్ గా అనిక ఎలాంటి క్రేజ్ సంపాదించుకుంటుందో.

హీరోయిన్గా సక్సెస్ అందుకున్న అజిత్ రీల్ కూతురు.. ప్రసంశలు అందుకుంటున్న అనిక సురేంద్రన్..

హీరోయిన్గా సక్సెస్ అందుకున్న అజిత్ రీల్ కూతురు.. ప్రసంశలు అందుకుంటున్న అనిక సురేంద్రన్..