IPL 2024: మరికాసేట్లో ఐపీఎల్ ఫైనల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టాలీవుడ్ తారల స్పెషల్ విషెస్.. వీడియో ఇదిగో

సుమారు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్ ఆఖరి అంకానికి చేరుకుంది. లీగ్ స్టేజ్ లో టాప్-2లో నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

IPL 2024: మరికాసేట్లో ఐపీఎల్ ఫైనల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టాలీవుడ్ తారల స్పెషల్ విషెస్.. వీడియో ఇదిగో
IPL 2024 Final
Follow us

|

Updated on: May 26, 2024 | 4:32 PM

సుమారు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్ ఆఖరి అంకానికి చేరుకుంది. లీగ్ స్టేజ్ లో టాప్-2లో నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మరికొన్ని గంటల్లో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 10 ఏళ్ల తర్వాత మూడో ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవాలనుకుంటోన్న కోల్ కతా, మరోవైపు రెండో ధనాధన్ లీగ్ టైటిల్ నెగ్గాలనే కసితో సన్ రైజర్స్ హైదరాబాద్ పోటాపోటీగా తలపడనున్నాయి. దీంతో మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించాలని టాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్ తెలిపారు. ఎస్‌ఆర్‌హెచ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్, అల్లరి నరేష్, విజయ్ దేవర కొండ, బ్రహ్మానందం, అంజలి, వెంకటేష్, నాగార్జున, శ్రీనివాస రెడ్డి, రాజ్ తరుణ్, సాయి కుమార్, ఆనంద్ దేవరకొండ, కార్తికేయ, నారా రోహిత్ తదితరులు ఎస్ ఆర్ హెచ్ కు బెస్ట్ విషెస్ తెలిపిన వారిలో ఉన్నారు.

ఎవరెవరు ఏమన్నారంటే?

  • విశ్వక్ సేన్ – ‘సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది ఆర్డినరి కాదు.. ఎక్స్ ట్రార్డినరి’
  • అల్లరి నరేష్- ‘ఆడి గెలుద్దాం.. 2016ను రిపీట్ చేద్దాం’
  • సాయి కుమార్- ‘దూసుకెళ్లడం.. మన తెలుగోడి సిగ్నేచర్’
  • కార్తికేయ- ‘సన్ రైజర్స్ హిస్టరీ క్రియేట్ చేయడం ఈ ప్రపంచం చూస్తుంది’
  • ఆనంద్ దేవరకొండ- ‘ఆరెంజ్ ఎప్పటికీ ఓ రేంజ్ లో ఉండాలి’
  • అంజలి- ‘సన్ రైజర్స్ ఇలాగే రైజ్ అవ్వడం కంటిన్యూ చేయాలి’
  • విజయ్ దేవరకొండ- ‘తెలుగు నేల నేర్పిన తెగువ ఏంటో చూపిద్దాం’
  • వెంకటేశ్- ‘సన్‌ రైజర్స్ కు భయమే లేదు.. భయపెట్టడమే తెలుసు’
  • నాగార్జున- ’20 ఓవర్లలో 287 కొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. వీళ్ల ఆటే సునామీ’
ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ యోగాసనం బెస్ట్ రెమిడి
భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ యోగాసనం బెస్ట్ రెమిడి
కన్నతండ్రిని కడతేచ్చిన కసాయి కూతురు.. దర్యాప్తులో సంచలన విషయాలు..
కన్నతండ్రిని కడతేచ్చిన కసాయి కూతురు.. దర్యాప్తులో సంచలన విషయాలు..
వారెవ్వా.. మీ తెలివి చల్లగుండా.. ట్రాక్టర్‌ని భలేగావాడేస్తున్నారు
వారెవ్వా.. మీ తెలివి చల్లగుండా.. ట్రాక్టర్‌ని భలేగావాడేస్తున్నారు
ఆంధ్రాలోని ఈ జిల్లాల్లో పిడుగుల వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఆంధ్రాలోని ఈ జిల్లాల్లో పిడుగుల వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
అప్పుడు ఆసీస్‌.. ఇప్పుడు ఇటలీ.. తుఫాన్ సెంచరీతో భారీ రికార్డ్
అప్పుడు ఆసీస్‌.. ఇప్పుడు ఇటలీ.. తుఫాన్ సెంచరీతో భారీ రికార్డ్
రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా..? వీటి చరిత్ర తెలిస్తే..
రైలు టికెట్‌పై ఉండే 5 అంకెలను గమనించారా..? వీటి చరిత్ర తెలిస్తే..
బాబోయ్.. బంగారం సినిమా చిన్నారి బీభత్సంగా మారిపోయిందిగా..!
బాబోయ్.. బంగారం సినిమా చిన్నారి బీభత్సంగా మారిపోయిందిగా..!
అరె మావా.! దమ్ముంటే ఈ ఫోటోలో పామును గుర్తించు..
అరె మావా.! దమ్ముంటే ఈ ఫోటోలో పామును గుర్తించు..
సైకిల్ నేర్చుకునే ఏజ్లో స్కూటర్ నడుపుతున్న బాలుడు.. వీడియో వైరల్
సైకిల్ నేర్చుకునే ఏజ్లో స్కూటర్ నడుపుతున్న బాలుడు.. వీడియో వైరల్
“మెదడును తినే అమీబా” ఐదేళ్ల బాలికను మింగేసింది..
“మెదడును తినే అమీబా” ఐదేళ్ల బాలికను మింగేసింది..