Prabhas: ప్రభాస్, హను రాఘవపూడి సినిమా స్టోరీ ఇదే.. అప్పుడే మూడు సాంగ్స్..
త్వరలోనే స్పిరిట్, సలార్ 2 సినిమాలు స్టార్ట్ కానున్నాయి. ఇవే కాకుండా సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారట. కొంతకాలంగా ఈ మూవీ గురించి నెట్టింట ప్రచారం నడుస్తుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్మెంట్ రాలేదు. దీంతో అసలు హను, ప్రభాస్ కాంబోలో ప్రాజెక్ట్ ఉందా ?.. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విషయాలపై క్లారిటీ కూడా రాలేదు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇప్పుడు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అలాగే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు. ఇందులో వింటెజ్ ప్రభాస్ ను అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇవే కాకుండా త్వరలోనే స్పిరిట్, సలార్ 2 సినిమాలు స్టార్ట్ కానున్నాయి. ఇవే కాకుండా సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారట. కొంతకాలంగా ఈ మూవీ గురించి నెట్టింట ప్రచారం నడుస్తుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్మెంట్ రాలేదు. దీంతో అసలు హను, ప్రభాస్ కాంబోలో ప్రాజెక్ట్ ఉందా ?.. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విషయాలపై క్లారిటీ కూడా రాలేదు.
తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ హను గతంలో తెరకెక్కించిన లవ్ స్టోరీస్ మాదిరిగా కాకుండా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని.. ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్ తో రజాకార్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించనున్నారని తెలుస్తోంది. యుద్ధం బ్యా్క్ డ్రాప్ తో ఈ సినిమా స్టోరీ ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారని.. ఇప్పటికే మూడు సాంగ్స్ కూడా రెడీ చేశారని టాక్. మరోవైపు ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. దీంతో ఇప్పుడ హను, ప్రభాస్ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఈ సినిమా గురించి ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి.
ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశకు చేరుకున్నాయి. అలాగే సలార్ 2, స్పిరిట్ మూవీస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. ఇక గతంలో హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



