TOP9 ET: దారుణం ఇది! ప్రభాస్‌కే ఎందుకు ఇలా అవుతోంది! |అదే నిజమైతే.. NTRని అందుకోవడం కష్టమే.

TOP9 ET: దారుణం ఇది! ప్రభాస్‌కే ఎందుకు ఇలా అవుతోంది! |అదే నిజమైతే.. NTRని అందుకోవడం కష్టమే.

Anil kumar poka

|

Updated on: Apr 08, 2024 | 9:14 AM

యాక్టింగ్‌లో యంగ్ టైగర్..! మాస్ పీపుల్‌కు వన్ అండ్ ఓన్లీ మ్యాన్‌! అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్లకు వెళ్లనున్నాడు. హాలీవుడ్‌లో కూడా తన సినిమాతో బజ్ చేయనున్నాడు. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాను పాన్ ఇండియా రేంజ్లో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట. ఇంగ్లీష్‌లో హాలీవుడ్‌లో కూడా ఓకే సారి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట.

01. ntr: అదే నిజమైతే.. NTRని అందుకోవడం కష్టమే

యాక్టింగ్‌లో యంగ్ టైగర్..! మాస్ పీపుల్‌కు వన్ అండ్ ఓన్లీ మ్యాన్‌! అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్లకు వెళ్లనున్నాడు. హాలీవుడ్‌లో కూడా తన సినిమాతో బజ్ చేయనున్నాడు. ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ న్యూస్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాను పాన్ ఇండియా రేంజ్లో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట. ఇంగ్లీష్‌లో హాలీవుడ్‌లో కూడా ఓకే సారి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఇదే కనుక నిజం అయితే.. మరే హీరో కూడా ఎన్టీఆర్‌ను అందుకోవడం కష్టమే అంటున్నారు తారక్‌ ఫ్యాన్స్.

02. prabhas దారుణం ఇది! ప్రభాస్‌కే ఎందుకు ఇలా అవుతోంది!

ప్రభాస్‌ మంచోరు! తన నియర్ అండ్ డియర్స్‌కు చేదోడు వాదోడుగానే ఉంటారు. అవసరమైతే ఎంతటి హెల్ఫ్ అయినా చేస్తుంటారు. పైగా పాన్ ఇండియా రేంజ్‌లో నెంబర్‌ వన్ ట్యాగ్తో… వెలిగిపోతూనే ఉంటారు. అలాంటి తమ హీరో సినిమా రిలీజ్‌కే.. ఎప్పటికీ? అడ్డంకులెందుకు అంటూ.. తెగ బాధపడిపోతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. రాధేశ్యామ్‌, సలార్ సినిమాలు కూడా ఇలాగే పోస్ట్ పోన్ అయ్యామని.. ఇప్పుడు కల్కి విషయంలో కూడా ఇదే జరగడం బాలేదని వారంటున్నారు. పరిస్థితులు ఏవైనా.. ప్రభాస్ విషయం ఇలా జరగడం తమకు నచ్చడంలేదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

03.dill raju: మేం హ్యాపీ.. మా టార్గెట్ రీచ్ అయ్యాం..

పరుశురాం డైరెక్షన్లో.. విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఫ్యామిలీ స్టార్. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. అయితేనేం.. ఫ్యామిలీ స్టార్ రిజల్ట్‌ విషయంలో తాము హ్యాపీ అంటున్నారు దిల్ రాజు. రివ్యూలు సంగతి పక్కకు పెడితే.. ఫ్యామిలీ ఆడియెన్స్ 90 శాతం హ్యాపీగా ఉన్నట్టు తమకు చెప్పారన్నారు. ఈ సినిమా కలెక్షన్స్‌ విషయంలో తాము టార్గెట్ కూడా రీచ్‌ అయ్యాం అన్నట్టు చెప్పారు.

04. dhanush: 6 ఏళ్లుగా ధనుష్‌తో గొడవ ఉంది.! ఒప్పుకున్న హీరో

ఫ్రెండ్ షిప్‌లో గొడవలు.. కొట్లటలు.. కలుసుకోవడాలు.. కలుపుకుపోవడాలు కామన్‌.! హీరో ధనుష్ తన మధ్య కూడా 6 ఏళ్ల తర్వాత ఇదే జరిగిందన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాశ్. ధనుష్ తన ఫ్రెండ్ అని.. అయితే ఓ చిన్న విషయంలో తాము గొడవ పడి.. దాదాపు 6 ఏళ్లు మాట్లాడుకోలేదన్నాడు జీవీ. కానీ ఇప్పుడు అలాంటి గొడవలేం లేవని.. ధనుష్ ఎప్పటికీ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు దోస్తాన్‌ కోసం ధనుష్ కూడా ఎక్కడివరకైనా వెళతాడంటూ.. తన ఫ్రెండ్‌ను కూడా వెనకేసుకొచ్చాడు.

05. vijay: ఫ్యామిలీ స్టార్‌ బంపరాఫర్‌.. మీ ఇంటికే విజయ్‌ దేవరకొండ!

ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్‌ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నేరుగా మీ ఇంటికే వస్తా అంటూ.. గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రతీ ఫ్యామిలీలో ఉండే మీ ఫ్యామిలీ స్టార్ గురించి తామిచ్చే ఫాం ద్వారా తమకు తెలియజేస్తే… చాలన్నారు. ఎంపికై ఆ ఫ్యామిలీ స్టార్‌ను.. ఆ స్టార్ కుటుంబాన్ని నేరుగా వారింటికే వచ్చి కలిస్తా అన్నారు విజయ్‌ దేవరకొండ. అయితే కలిసేందుకు విజయ్ దేవరకొండ ఒక్కరే కాదు.. కూడా హీరోయిన్‌ మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ పరుశురామ్‌ కూడా మీ ఇంటికి రానున్నారు.

06. rashi khanna: ఖరీదైన ఇంటిని కొన్న స్టార్ హీరోయిన్

ఒకప్పట్లా కాదు.. ఇప్పుడు హీరోయిన్లు ఆర్థిక భద్రత గురించి బానే ఆలోచిస్తున్నారు. సంపాదించిన డబ్బును జల్సాలకు.. లగ్జరీ అవసరాలకు మాత్రమే వెచ్చించకుండా.. రియల్ ఎస్టేట్‌ లో పెట్టుబడి పెడతున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఇదే చేస్తున్నారు. తన సంపాదించిన డబ్బులతో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే హైద్రాబాద్‌లో రెండు ఇళ్లను కొనుగోలు చేసిన ఈ బ్యూటీ.. తాజాగా మరో ఇంటిని కూడా ఓన్ చేసుకున్నారు. అదే ఇంట్లో తన నియర్ అండ్ డియర్స్‌తో గృహ ప్రవేశం చేసి.. ఆ ఫోటోలను తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.

07. thapsee: చాలా కప్పలను ముద్దు పెట్టుకున్నాకే నా యువరాజు దొరికాడు

చిన్నప్పుడు అందరికీ తెలిసిన స్టోరే..! అనగనగా ఓ యువరాణి ఓ కొలనులో ఉన్న కప్పను ముద్దుపెట్టుకుంటే.. ఆ కప్ప కాస్తా శాపం నుంచి విముక్తి పొంది యువరాజుగా మారతాడట. తనకు శాప విమోచనం చేసిన యువరాణిని పెళ్లి చేసుకుంటాడట. అయితే ఇదే స్టోరీని ఓన్ చేసుకుని.. ఓ క్రేజీ స్టేట్మెంట్‌ ఇచ్చింది తాప్సీ. తన లాంగ్‌ టైమ్ లవర్‌ మథియాస్ బోనును కనుగొనే ప్రయత్నంలో.. చాలా మంది కప్పలకు ముద్దులు పెట్టానంటూ.. చీజీ కామెంట్స్ చేసింది. ఆ తరువాత కానీ.. తన సోల్ మేట్ మథియాస్ తనకు దొరకలేందంటూ రీసెంట్‌ ఇంటర్వ్యూలో చెబుతూ నవ్వేసింది.

08.andriya: పెళ్ళైన వ్యక్తితో ఎఫైర్.. ఫలితం అనుభవించా..

సింగర్‌గా.. యాక్టరస్‌గా అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ నామ్ కమాయించిన ఆండ్రియా.. తన జీవితంలోని డార్క్‌ షేడ్‌ను తాజాగా అందరితో పంచుకున్నారు. గతంలో ఓ పెళ్లైన వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నానని చెప్పిన ఆండ్రియా.. ఆ వ్యక్తి కారణంగా మానసికంగా.. శారీరకంగా తీవ్ర వేధనకు గురయ్యా అన్నారు. ఇవన్నీ భరించలేక తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా అన్నారు. ఇక ఆ డిప్రెషన్ నుంచి బయట పడేందుకు చాలా కష్టపడ్డానని.. చివరికి ఆయుర్వేద చికిత్సతో బయటపడ్డా అన్నారు. అలా డిప్రెషన్ నుంచి బయట పడ్డాకే ఓ బుక్ రాశానని.. తర్వాత తన కెరీర్ పై ఫోకస్ పెట్టా అని చెపారు ఆండ్రియా..!

09.bigg boss 8: మళ్లొస్తోంది బిగ్ బాస్.

పక్కింట్లో లొల్లి జరిగితే చూసి ఎంటర్‌టైన్ అవుతుంటాం..! అలాంటిది! అదే కాన్ఫెప్ట్‌తో వచ్చిన బిగ్ బాస్‌ను వదిలిపెడతామా? పెట్టము కదా..! చూశాం..! టీఆర్పీలు రికార్డ్‌ లెవల్లో ఎగబాకే వరకు బిగ్ బాస్‌ చూస్తూనే ఉన్నాం.! రీసెంట్‌గా బిగ్ బాస్ సీజన్‌7ను హిట్ చేశాం.. ! ఇక ఇప్పుడు బిగ్ బాస్ 8 వస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని టాక్ వస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి తొందర్లో ఈ సీజన్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా బయటికి వస్తుంది. అన్నట్టు ఈ సారి కూడా హోస్ట్ నాగార్జుననే!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..