Ram Charan: చరణ్.. శంకర్ ప్రాజెక్ట్ నుంచి ఆసక్తికర అప్డేట్.. ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో..

ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు వీడియోస్, ఫోటోస్ లీక్ అయ్యి నెట్టింటిని షేక్ చేశాయి. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతుంది.

Ram Charan: చరణ్.. శంకర్ ప్రాజెక్ట్ నుంచి ఆసక్తికర అప్డేట్.. ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో..
Rc15
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 07, 2023 | 5:22 PM

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాత ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం చరణ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టిన ఈ సినిమా ఇప్పుడు ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు వీడియోస్, ఫోటోస్ లీక్ అయ్యి నెట్టింటిని షేక్ చేశాయి. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతుంది.

ఈ సినిమాలో చరణ్ పై ఓ భారీ సాంగ్ చిత్రీకరించేందుకు పనులు ప్రారంభించారని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మంది డ్యాన్సర్లను రప్పిస్తున్నారట. శంకర్ భారీ స్థాయిలో పాటల చిత్రీకరించడంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈ వారం చివర్లోనే ఈ సాంగ్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఆర్సీ 15 ప్రకటన అనంతరం వీరి ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.

ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా !!
కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా !!
పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!
పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!
ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??
ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??
ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..
ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..