India US Trade Deal: మోదీ మాస్టర్ స్ట్రోక్.. చైనా, పాకిస్థాన్‌కు షాక్! తక్కువ టారిఫ్ కట్టే దేశంగా భారత్..!
భారత్, అమెరికా మధ్య దీర్ఘకాల వాణిజ్య వివాదాలకు మోడీ, ట్రంప్ తెరదించారు. కీలకమైన ట్రేడ్ డీల్ ద్వారా భారతీయ వస్తువులపై అమెరికా విధించే సుంకాలు 50 శాతం నుండి 18 శాతానికి తగ్గాయి. ఇది భారతీయ ఎగుమతుల కు గొప్ప ప్రోత్సాహం.

భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా చాలా కాలంగా నెలకొన్న గందరగోళానికి ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కలిసి తెరదించారు. తాజాగా ఈ రెండు దేశాల మధ్య కీలకమైన ట్రేడ్ డీల్ సెట్ అయింది. ఈ డీల్‌తో భారత్‌పై 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గించింది అమెరికా. ఇకపై అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులు అతి తక్కువ టారిఫ్‌తో అమెరికాలోకి ప్రవేశించనున్నాయి.
భారతీయ వస్తువులపై అమెరికా 25 శాతం టారిఫ్‌లు విధించేది, అలాగే రష్య నుంచి ముడి చమురు కొనుగోలుపై అదనంగా 25 శాతం సుంకం విధించారు. ఇప్పుడు కొత్త ఒప్పందంతో సాధారణ దిగుమతి సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించి, 25 శాతం ఉన్న అదనపు సుంకాలను పూర్తిగా తొలగించారు.
అయితే ఈ కొత్త సుంకాలతో ఇతర ఎగుమతి పోటీదారులతో పోల్చుకుంటే భారత్ అతి తక్కువ సుంకాలతో అమెరికాకు వస్తువులను ఎగుమతి చేయనుంది. చైనా, పాకిస్థాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలు సైతం భారత్ కంటే ఎక్కువ సుంకాలు కడుతున్నాయి. ఆగ్నేయాసియాలో ఉన్న ఎగుమతి పోటీదారులతో పోల్చుకుంటే భారత్‌పై అతి తక్కువ సుంకాలు ఉన్నాయి.
అమెరికా అధిక సుంకాలు
- చైనా: 37 శాతం
- బ్రెజిల్: 50 శాతం
- దక్షిణాఫ్రికా: 30 శాతం
- మయన్మార్: 40 శాతం
- లావోస్: 40 శాతం
తక్కువ సుంకాలు:
- యూరోపియన్ యూనియన్: 15 శాతం
- జపాన్: 15 శాతం
- దక్షిణ కొరియా: 15 శాతం
- స్విట్జర్లాండ్: 15 శాతం
- యునైటెడ్ కింగ్‌డమ్: 10 శాతం
ఆగ్నేయాసియాలో
- బంగ్లాదేశ్: 20 శాతం
- వియత్నాం: 20 శాతం
- మలేషియా: 19 శాతం
- కంబోడియా: 19 శాతం
- థాయిలాండ్: 19 శాతం
- పాకిస్తాన్: 19 శాతం
- భారత్: 18 శాతం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
