AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Prices: చరిత్ర ముందే చెప్పింది.. బంగారం, వెండి ధరలు పాతాళానికి.! ఇన్వెస్టర్లది అథోగతే

బంగారం, వెండి ధరలు పీఛేముడ్ కొట్టేశాయి. కన్‌జ్యూమర్లకు మళ్లీ మెంటలెక్కిస్తున్నాయి. నాలుగురోజుల ముందున్న వెండి ధరకు ఇవాళున్న ధర దాదాపు సగం. అంటే.. వందశాతం పెరిగినట్టే పెరిగి.. అదే వంద శాతం గోడక్కొట్టిన బంతిలాగే మళ్లీ వెనక్కొచ్చింది. పుత్తడిది కూడా అదే దారి. యూటర్న్ కొట్టిన పసిడి ధరలు మరో వారం రోజుల్లో ఎక్కడికొచ్చి ఆగుతాయి? బులియన్ మార్కెట్ ఎనలిస్టులు ఏమంటున్నారు?

Gold Silver Prices: చరిత్ర ముందే చెప్పింది.. బంగారం, వెండి ధరలు పాతాళానికి.! ఇన్వెస్టర్లది అథోగతే
Gold And Silver
Ravi Kiran
|

Updated on: Feb 03, 2026 | 9:00 AM

Share

బంగారం లక్షా 80 వేలు దాటిందని, వెండి 4 లక్షల మార్క్ టచ్ చేసిందని గతవారంలో అవాక్కయ్యాం కదా.. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది. గత గురువారం లక్షా 90 వేలు పలికింది పదిగ్రాముల బంగారం ధర. ఇదే ఆల్‌టైమ్ రికార్డ్. నాలుగైదు రోజులు తిరిగేసరికల్లా అనూహ్యంగా దిగొచ్చి, దాదాపు 40 వేలు కరెక్షన్ తీసుకుని లక్షా 50 వేల దగ్గర ఆగింది. ఇదే రకంగా వెనకెనక్కు నడిస్తే వారం రోజుల్లో లక్షకు చేరుకున్నా ఆశ్చర్యం లేదట. మొన్నటిదాకా రెండు లక్షల దిశగా ఎగబాకిన బంగారం ధర.. మళ్లీ లక్షకు దిగొస్తుందా అన్న జోస్యాలు నిజమయ్యేలా ఉన్నాయి. మరో ప్రీషియస్ మెటల్ వెండిది కూడా అదే దారి. గత వారంలో 4 లక్షల 20 వేలను టచ్ చేసిన వెండి, నాలుగేనాలుగు రోజుల్లో 40 శాతం డౌన్‌ఫాల్ చూసింది. దేశీయ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో కిలో వెండి ధర 2 లక్షల 27 వేల దగ్గర కదులుతోంది. అంటే, వారం రోజుల్లో సగానికి సగం పడిపోయింది.

పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం తర్వాత బంగారం, వెండి ధరలు మరీ క్షీణించడం మొదలైంది. డాలర్‌ విలువతో పాటు, ట్రెజరీ బాండ్లపై రాబడి పెరగడం.. ఇన్వెస్టర్లు లాభాలకు అలవాటు పడటంతో ధరలు దారుణంగా క్షీణిస్తున్నాయి. మొన్నటిదాకా కాసుల వర్షం కురిపించిన సిల్వర్‌ ETFలు.. ఇప్పుడు నేలచూపులు చూడ్డంతో ఇన్వెస్టర్లకు సినిమా కనిపిస్తోంది. ఇప్పుడున్న ట్రెండును చూసి, మళ్లీ 1980 నాటి పరిస్థితి రిపీటౌతుందా అని బెంబేలెత్తిపోతున్నారు మార్కెటీర్లు. ఎందుకంటే, అప్పట్లో ఒకే ఏడాదిలో నాలుగైదింతలు పెరిగిన బంగారం ధర.. మళ్లీ సాధారణ స్థితికి చేరుకోడానికి 26 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా నెలల గ్యాప్‌లోనే వరుసగా లాంగ్‌జంపులు కొట్టి రెండుమూడింతలు పెరిగిన బంగారం-వెండి ధరలు.. మళ్లీ తేరుకుని సెట్‌రైట్ కావడానికి ఎన్నేళ్లు పడుతుంతో అంచనాలకు అందడం లేదు. ఇరాన్‌తో డీల్‌ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ఊరించడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చీఫ్‌ను మారుస్తారన్న వార్తలు రావడం.. డాలర్ విలువ బలపడ్డం… ఇవన్నీ ఇన్వెస్టర్లలో భయాల్ని పెంచుతోంది. అందుకే, భారీ స్థాయిలో కరెక్షన్ తీసుకుందట పుత్తడి ధర. అటు భారత్, అమెరికా ట్రేడ్ డీల్ కుదరడం.. అలాగే నెగిటివ్ సెంటిమెంట్ ఇదేవిధంగా కొనసాగితే బంగారం, వెండి ధరలు ఇంకాఇంకా కిందికి చూస్తే… ట్రెడిషనల్ ఇన్వెస్టర్‌ది అథోగతే మరి.

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?