AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా వారసుడు పుట్టిన వేళ.. బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్న చిరు-బాలయ్య

మెగా వారసుడు పుట్టిన వేళ.. బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్న చిరు-బాలయ్య

Phani CH
|

Updated on: Feb 02, 2026 | 6:27 PM

Share

2027 సంక్రాంతికి టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య భారీ బాక్సాఫీస్ యుద్ధం తప్పదు. చిరు 'కాక', బాలయ్య గ్యాంగ్‌స్టర్ చిత్రం బరిలో ఉన్నాయి. చిరంజీవి ఇటీవల 'మన శంకర వర ప్రసాదు గారు' సినిమాతో 360 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ క్రేజీ క్లాష్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.

బాక్సాఫీస్ దగ్గర మరో మెగా – నందమూరి వార్‌కు రంగం సిద్దమవుతోంది. 2027 సంక్రాంతి బరిలో చిరు – బాలయ్య పోటీ పడేట్టు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎట్ ప్రజెంట్ మన శంకర వర ప్రసాదు గారు సినిమాతో జోష్‌ మీదున్న చిరు.. బాబీ డైరెక్షన్లో మాస్ ఎంటర్‌ టైనర్ ‘కాక’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా తీసుకొచ్చే ప్రయత్నాల్లో బాబీ బిజీగా ఉన్నాడు. ఇక మరో పక్క బాలయ్య – గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ గ్యాంగ్ స్టర్‌ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కూడా 2027 సంక్రాంతి టార్గెట్‌గా తెరకెక్కుతోంది. దీంతో సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోల మధ్య బాక్సాఫీస్‌ వార్ జరగనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ వార్‌లో ఎవరు గెలుస్తారనే చర్చ కూడా నెట్టింట మొదలైనట్టు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరూస్ మన శంకర వర ప్రసాదు గారు మూవీ స్టిల్ ఏదో రికార్డ్‌ను క్రియేట్ చేస్తూనే ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ.. నైజాం ఏరియాలో ఇప్పుడు అరుదైన రికార్డుకు కేరాఫ్ అయింది. చిరు మూవీని ఒక్క నైజాం ఏరియాలోనే 3లక్షల + మంది చూశారని.. మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ రికార్డ్‌ కాస్తా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక కలెక్షన్స్‌ విషయంలోనూ మన శంకర వర ప్రసాదు మూవీ ఇంకా దూకుడుగానే ముందుకు సాగుతోంది. మూడూ వారంలోనూ మూవీ వరల్డ్‌ వైడ్‌గా 360ప్లస్ క్రోర్ గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూలు చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెంచరీలు కొట్టే వయసు.. 94 ఏళ్లకు కొత్త సినిమా ప్రకటన

Chiranjeevi: మెగా సెంటిమెంట్‌తో కొడుతున్న చిరంజీవి.. మరో హిట్ పక్కాన ?

బాలీవుడ్ హీరోయిన్స్ కాదు.. కేరాఫ్ టాలీవుడ్ వాళ్లు

హిట్టు కోసం అష్టకష్టాలు.. అయినా కరుణించని విజయం

Kerala Story 2: మరో కాంట్రవర్సీకి రంగం సిద్ధం.. రచ్చ చేస్తున్న కేరళ స్టోరీ 2 టీజర్