Kerala Story 2: మరో కాంట్రవర్సీకి రంగం సిద్ధం.. రచ్చ చేస్తున్న కేరళ స్టోరీ 2 టీజర్
ది కేరళ స్టోరీ చిత్రానికి కొనసాగింపుగా ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ టీజర్ విడుదలైంది. తొలి భాగం కేరళకు పరిమితమైతే, సీక్వెల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు విస్తరించింది. మత మార్పిడి, లవ్ ట్రాప్స్ వంటి అంశాలతో ఈ చిత్రం మరోసారి వివాదాలకు కేంద్రంగా మారనుంది. ఫిబ్రవరి 27న సినిమా విడుదల కానుంది.
చూస్తుంటే కాంట్రవర్సీలకు బాగా అలవాటు పడిపోయినట్లున్నారు మన దర్శకులు.. అందుకే హాయిగా కథల కంటే ఎక్కువగా వివాదాల మీదే ఫోకస్ చేస్తున్నారు. మూడేళ్ళ కింద ఇండియన్ సినిమాను షేక్ చేసిన ఓ బ్రేకింగ్ సినిమాకు సీక్వెల్ వస్తుందిప్పుడు. టీజర్‌తోనే కావాల్సినంత కాంట్రవర్సీ స్టఫ్ తీసుకొచ్చింది ఆ సినిమా. మరి ఏంటది.. ఆ టీజర్‌లో ఏముంది..? ఇండియన్ సినిమాను కొన్నేళ్లుగా కాంట్రవర్సీ కథలే నడిపిస్తున్నాయి. కొందరు వాటిని ప్రోపగాండా సినిమాలని విమర్శిస్తున్నా.. వివాదాల మధ్యే విడుదలై సంచలనాలు రేపుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకార్, ది బెంగాల్ ఫైల్స్, సబర్మతి రిపోర్ట్ లాంటి సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా వివాదాలు రేపాయి. తాజాగా కేరళ స్టోరీ 2 వచ్చేస్తుంది. 2023లో 20 కోట్లతో తెరకెక్కి.. 300 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు రేపింది కేరళ స్టోరీ. విజయం కంటే ఎక్కువ వివాదాలను మూటగట్టుకుంది ఈ చిత్రం.. దీనికిప్పుడు ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్ పేరుతో సీక్వెల్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ సారి కాంట్రవర్సీలు ఖండాలు దాటేలా కనిపిస్తున్నాయి. మొదటి భాగం కేవలం కేరళకు పరిమితమైతే.. ఈసారి కథ మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు పాకింది. మతమార్పిడి, లవ్ ట్రాప్స్‌తో ముగ్గురమ్మాయిలు ఎలా చితికిపోయారనే లైన్‌తో సీక్వెల్ వస్తుంది. ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా నటిస్తున్న ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకుడు. అబ్ సహేంగే నహీ.. లడేంగే అనే డైలాగ్‌తో టీజర్‌ను ముగించారు. ఫిబ్రవరి 27న రానుంది కేరళ స్టోరీ 2.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దసరాపై దండయాత్ర.. రేసులో ముగ్గురు స్టార్స్
TOP 5 ET: మరో వార్.. మరి ఈ సారి ఏమువుతుందో..? | నైజాంలో చిరు నయా రికార్డ్
TOP 9 ET: చంటి బిడ్డ అనీ చూడకుండా.. ఫ్యాన్స్ అత్యుత్సాహం..!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

