AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరాపై దండయాత్ర.. రేసులో ముగ్గురు స్టార్స్

దసరాపై దండయాత్ర.. రేసులో ముగ్గురు స్టార్స్

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Feb 02, 2026 | 6:01 PM

Share

2026 దసరా సీజన్‌ను టాలీవుడ్ స్టార్ హీరోలు లక్ష్యంగా చేసుకున్నారు. రామ్ చరణ్ పెద్ది మార్చి నుండి దసరాకు వాయిదా పడింది. ప్రభాస్ ఫౌజీ కూడా అక్టోబర్‌లో విడుదల కానుంది. వీరికి పోటీగా నాగార్జున తన 100వ సినిమాతో దసరా బరిలో నిలుస్తున్నారు. ఈసారి విజయదశమికి బాక్స్ ఆఫీస్ వద్ద ముగ్గురు స్టార్స్ మధ్య పోరు అనివార్యం.

సమ్మర్ తర్వాత మన హీరోలు ముందుగా ఫోకస్ చేసేది దసరా సీజన్‌నే.. అప్పుడు హాలీడేస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమ్మర్ మిస్సైన వాళ్లంతా విజయదశమికే రావాలనుకుంటారు. అందుకే 2026లోనూ ఆర్నెళ్ళకు ముందే దసరా సీజన్ ఫుల్ అయిపోతుంది. వరసగా స్టార్స్ పండక్కే ఖర్చీఫులు వేస్తున్నారు. మరి ఈసారి దసరా వార్ ఎలా ఉండబోతుంది..? సంక్రాంతి.. సమ్మర్.. దసరా.. ఎప్పుడూ బోర్ కొట్టవు. వరసగా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అదే జరగబోతుంది. ఆల్రెడీ సంక్రాంతి అయిపోయింది.. సమ్మర్ రాబోతుంది.. దసరాకు ముగ్గురు నలుగురు స్టార్స్ రెడీ అవుతున్నారు. అందరికంటే ముందు అందులో చరణ్ ఉన్నారు.. మార్చి 27 నుంచి పెద్ది వాయిదా పడితే నెక్ట్స్ టార్గెట్ దసరానే. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యంతో పెద్ది మార్చి నుంచి దసరాకి వాయిదా పడటం దాదాపు ఖాయమైపోయింది. అలాగే ప్రభాస్ ఫౌజీ సైతం దసరానే టార్గెట్ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా 50 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేసి.. అక్టోబర్‌లో సినిమా విడుదల చేసేందుకు టీం సన్నద్ధమవుతున్నారు. హను రాఘవపూడి ఫౌజీని తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు ఫౌజీ ఒక్కటే అనుకున్నారు.. కానీ పెద్ది వచ్చేలా ఉందిప్పుడు. ప్రభాస్, చరణ్‌కు పోటీగా నాగార్జున కూడా దసరాకే దండయాత్ర చేయబోతున్నారు. కింగ్ 100వ సినిమా కూడా పండక్కే రెడీ అవుతుంది. రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సైలెంట్‌గా పూర్తవుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ అయిపోయినట్లు తెలుస్తుంది. నాగార్జున సినిమానే కదా అని తక్కువంచనా వేయలేం.. ఎందుకంటే ఆయన 100వ సినిమా ఇది. అందుకే అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి ఈసారి దసరాకు ఇటు రామ్ చరణ్.. అటు ప్రభాస్.. మధ్యలో నాగ్.. ఇలా వార్ ఫిక్సైంది. అన్నట్లు మూడేళ్ళ కింద ఘోస్ట్ సినిమాతో దసరాకే వచ్చారు నాగ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 5 ET: మరో వార్.. మరి ఈ సారి ఏమువుతుందో..? | నైజాంలో చిరు నయా రికార్డ్

TOP 9 ET: చంటి బిడ్డ అనీ చూడకుండా.. ఫ్యాన్స్ అత్యుత్సాహం..!

TOP5: నాగ్ కొత్త స్ట్రాటజీ..నిరాశలో అక్కినేని ఫ్యాన్స్

బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ను మించేలా.. చిరు స్పెషల్ షో..

Jyothika: ఆ చెడ్డ అలవాటు మానకపోవడం వల్లే తరుచూ మా మధ్య గొడవ

Published on: Feb 02, 2026 05:48 PM