AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET: చంటి బిడ్డ అనీ చూడకుండా.. ఫ్యాన్స్ అత్యుత్సాహం..!

TOP 9 ET: చంటి బిడ్డ అనీ చూడకుండా.. ఫ్యాన్స్ అత్యుత్సాహం..!

Phani CH
|

Updated on: Feb 02, 2026 | 5:14 PM

Share

రామ్‌ చరణ్ - ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు. జనవరి 31 అర్ధరాత్రి ఈ విషయాన్ని నేరుగా మెగాస్టార్ చిరు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. పాప, బాబు క్షేమంగా ఉన్నారని తన ట్వీట్ లో కోట్ చేశారు. తెల్లారాక అపోలో ఆసుత్రిలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టి.. తన ఆనందాన్ని తెలుగు ప్రేక్షకులు, తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరిలో ఎవరు ముందు పుట్టారని మెగాస్టార్‌కు మీడియా పాయింట్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. అయితే ఆయన నేరుగా ఆన్సర్ ఇవ్వకపోయినా.. ముందుగా అబ్బాయి పుట్టారనే మాట కామినేని కుటుంబ సభ్యుల ద్వారా బయటికి వచ్చింది.

ఫ్యాన్స్ ఈమధ్య తమ అత్యుత్సాహాన్ని అపుకోలేకపోతున్నారు. ఎంతసేపూ.. తమ అభిమాన హీరోనో.. లేక హీరోయిన్‌నో తాకేందుకు.. సెల్ఫీ తీసుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే వారిని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఇక మెగా ఇంట వారసుడు పుట్టాడని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ భారీగా అపోలో హాస్పిటల్ కి చేరుకున్నారు. చరణ్‌ జిందాబాద్ అంటూ నినాదాలు చూస్తూ మెగా వారసుల రాకను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో క్లీంకారను ఎత్తుకుని చరణ్ ఆసుపత్రికి రాగా.. తన హీరో చేతిలో రెండేళ్ల చంటిబిడ్డ ఉందని కూడా చూడకుండా.. ఒక్క సారిగా చరణ్ మీదికి ఎగబడ్డారు. దీంతో క్లీంకార భయపడిపోయింది. తన చిన్ని చేతిలో కళ్లను మూసుకుని తన తండ్రిని గట్టిగా పట్టుకుంది. చరణ్‌ కూడా ఓ దశలో కాస్త సీరియస్‌గానే ఫ్యాన్స్ ను వారించినా.. పరిస్థితి అదుపుకాలేదు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ తీరును తప్పుబట్టేలా చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP5: నాగ్ కొత్త స్ట్రాటజీ..నిరాశలో అక్కినేని ఫ్యాన్స్

బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ను మించేలా.. చిరు స్పెషల్ షో..

Jyothika: ఆ చెడ్డ అలవాటు మానకపోవడం వల్లే తరుచూ మా మధ్య గొడవ

Vijay Deverakonda: 2026లో కొడితే.. డబుల్ ధమాఖానే..

TOP 9 ET: మారుతీకి అండగా పెద్ద సంస్థతో సినిమా సెట్ చేసిన ప్రభాస్‌