AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెంచరీలు కొట్టే వయసు.. 94 ఏళ్లకు కొత్త సినిమా ప్రకటన

సెంచరీలు కొట్టే వయసు.. 94 ఏళ్లకు కొత్త సినిమా ప్రకటన

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 02, 2026 | 6:06 PM

Share

94 ఏళ్ల వయసులో దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన 61వ సినిమాను ప్రకటించారు. పుష్పక విమానం, ఆదిత్య 369 వంటి క్లాసిక్స్ అందించిన ఆయన, వైజయంతీ మూవీస్ పతాకంపై, నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో మళ్లీ మెగాఫోన్ పడుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.

94 ఏళ్ళ వయసులో ఎవరైనా ఏం చేస్తారు..? ఇంట్లోనే ఉండి.. నిలబడ్డానికి కూడా మరొకరి సాయం తీసుకుంటూ ఉంటారు కదా..? కానీ ఇక్కడ ఓ లెజెండరీ దర్శకుడు మాత్రం 94 ఏళ్ళ వయసులో సినిమా అనౌన్స్ చేసారు. అది కూడా వైజయంతి లాంటి అగ్ర సంస్థలో.. నాగ్ అశ్విన్ లాంటి సంచలన దర్శకుడితో..! మరి ఎవరా దర్శకుడు..? ఏంటా సినిమా..? ఓ పుష్ప‌క విమానం, ఓ భైర‌వ‌ద్వీపం, ఓ ఆదిత్య 369… ఇలా ఇండియన్ సినిమా ముఖచిత్రం మార్చిన క్లాసిక్స్ ఎన్నో అందించిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీ‌నివాస‌రావు. వయోభారంతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ దర్శకుడు.. మ‌ళ్లీ మెగాఫోన్ పట్టారు. వైజయంతి మూవీస్‌లో నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో ఓ సినిమా ప్రకటించారు సింగీతం. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న 61వ సినిమా ఇది. పూర్తిగా కొత్త‌వాళ్లతో రానున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమాకు పని చేస్తున్నారు. గతంలో నాగీ తెరకెక్కించిన కల్కి సినిమాకు సింగీతం వర్క్ చేసారు.. కల్కి 2లోనూ ఆయ‌న పాత్ర ఉంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ వంతు వచ్చింది. 94 ఏళ్ల వయసులో సినిమా చేయడం అనేది చిన్న విషయం కాదు.. కానీ సింగీతం అది చేసి చూపించబోతున్నారు. అప్పుడెప్పుడో మాయాబజార్ నాటి నుంచి నేటి వరకు సినిమాలు చేస్తుండటం అద్భుతమే. SSR61 పేరుతో ఓ వీడియో విడుదల చేసారు మేకర్స్. త్వరలోనే టైటిల్ రానుంది. చివరగా 2013లో వెల్‌కమ్ ఒబామా సినిమా తెరకెక్కించారు సింగీతం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: మెగా సెంటిమెంట్‌తో కొడుతున్న చిరంజీవి.. మరో హిట్ పక్కాన ?

బాలీవుడ్ హీరోయిన్స్ కాదు.. కేరాఫ్ టాలీవుడ్ వాళ్లు

హిట్టు కోసం అష్టకష్టాలు.. అయినా కరుణించని విజయం

Kerala Story 2: మరో కాంట్రవర్సీకి రంగం సిద్ధం.. రచ్చ చేస్తున్న కేరళ స్టోరీ 2 టీజర్

దసరాపై దండయాత్ర.. రేసులో ముగ్గురు స్టార్స్