సౌమ్య కుటుంబానికి ‘కోటి’ ఎక్స్‌గ్రేషియా
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం, రిటైర్మెంట్ వరకు వేతనం చెల్లిస్తామని తెలిపారు. ఎక్సైజ్ ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. అనంతరం సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌమ్య లేని లోటు భర్తీ చేయలేనిదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, సౌమ్య సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు . ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సౌమ్య కుంటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, తమ సహచరిని కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయం అని అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యమని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల వెన్నులో వణుకు పుట్టేలా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు ఇచ్చే నిర్ణయం తమ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి రెండు నిముషాల మౌనం పాటించి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ ఖురేషి, ఎక్సైజ్ శాఖ అధికారుల సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nirmala Sitharaman: ఇక జిల్లాకో బాలికల హాస్టల్..
మెగా వారసుడు పుట్టిన వేళ.. బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్న చిరు-బాలయ్య
సెంచరీలు కొట్టే వయసు.. 94 ఏళ్లకు కొత్త సినిమా ప్రకటన
Chiranjeevi: మెగా సెంటిమెంట్‌తో కొడుతున్న చిరంజీవి.. మరో హిట్ పక్కాన ?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

