Hansika Marriage: పెళ్లి చేసుకోవడానికి హన్సిక ఇంత పోరాటం చేసిందా.. హన్సిక లవ్ షాదీ డ్రామా ట్రైలర్ చూశారా.?
సెలబ్రిటీల పెళ్లి అంటే అదో పెద్ద వేడుక. అందరి దృష్టి వారిపైనే పడుతుంది. దుస్తులు తయారు చేయడానికి డిజైనర్లు, సినిమాలను తలపించే పెద్ద పెద్ద సెట్టింగ్‌లు, సంగీత్‌లు, మెహందీ ఫంక్షన్లు.. అందరూ ఊహించేది ఇదే. అయితే అందరిలాగే సెలబ్రిటీల..
సెలబ్రిటీల పెళ్లి అంటే అదో పెద్ద వేడుక. అందరి దృష్టి వారిపైనే పడుతుంది. దుస్తులు తయారు చేయడానికి డిజైనర్లు, సినిమాలను తలపించే పెద్ద పెద్ద సెట్టింగ్‌లు, సంగీత్‌లు, మెహందీ ఫంక్షన్లు.. అందరూ ఊహించేది ఇదే. అయితే అందరిలాగే సెలబ్రిటీల జీవితాల్లో కూడా ఎమోషన్ ఉంటుంది. జీవితంలో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టే క్షణంలో ఉద్వేగ భరితంగా ఉంటారు. దీనికి ఎవరూ అతీథులు కాదు. ఇక సెలబ్రిటీలు తమ వివాహ వేడుకలను ఓటీటీల ద్వారా ప్రసారం చేయడం ఒక ట్రెండ్‌గా మారుతోంది. ఇప్పటికే నయనతార, విఘ్నేష్‌లు తమ వివాహ వేడుకను టెలికాస్ట్ చేయగా. ఇప్పుడు హన్సిక సైతం ఈ జాబితాలోకి వచ్చేసింది.
గతేడాది డిసెంబర్ 4వ తేదీన హన్సిక, సోహైల్ కథూరియా వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. జైపుర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుక స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ వీడియో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. టీజర్‌తో అందరినీ దృష్టిని ఆకర్షించిన హన్సిక తాజాగా ట్రైలర్‌లోనూ ఎమోషనల్ అయ్యింది. ఇందులో హన్సిక తన ప్రేమకు అసలు ఎక్కడ బీజం పడింది, కుటుంబ సభ్‌యులతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి వంటి అంశాలను పంచుకుంది.
ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ.. ‘కథూరియాతో పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు ‘ఇన్నాళ్లూ నా చుట్టూ తిరుగుతూ ఉన్న ఇతనా లైఫ్ పార్టనర్ అయ్యేది’ అని అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇక తమ వివాహం మోడ్రన్ పద్ధతిలో జరగాలంటూ కుటుంబ సభ్యులతో వాదించడం, తాను ఎమోషనల్ పర్సన్ అంటూ హన్సిక చెప్పడం చూస్తుంటే హన్సిక వివాహ వెనకాల ఇంత ఎమోషనల్ జర్నీ ఉందా అనిపించక మానదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..