Suriya-Jyotika: సూర్య, జ్యోతిక పిల్లలను ఎప్పుడైన చూశారా ?.. ఎంత క్యూట్‏గా ఉన్నారో..

రికి సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ నెట్టింట తక్కువగా వైరలవుతుంటాయి. తాజాగా తన కూతురు.. కొడుకుతో ఉన్న ఓ క్యూట్ ఫోటోను షేర్ చేశారు జ్యోతిక. ప్రస్తుతం ఈ క్యూట్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Suriya-Jyotika: సూర్య, జ్యోతిక పిల్లలను ఎప్పుడైన చూశారా ?.. ఎంత క్యూట్‏గా ఉన్నారో..
Suriya
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 07, 2023 | 4:17 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపూల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంట సూర్య అండ్ జ్యోతిక. వీరి జోడికి ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది. వీరిద్దరు 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జ్యోతిక ఇటీవలే రీఎంట్రీ ఇచ్చారు. పాత్ర ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరోవైపు వరుస హిట్ చిత్రాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు సూర్య. షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే చాలు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంటారు ఈ హీరో. అయితే వీరికి ఓ పాప దియా, బాబు దేవ్ ఉన్న సంగతి తెలిసిందే. తమ పిల్లలను ఎక్కువగా బయటకు తీసుకురారు సూర్య. వీరికి సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ నెట్టింట తక్కువగా వైరలవుతుంటాయి. తాజాగా తన కూతురు.. కొడుకుతో ఉన్న ఓ క్యూట్ ఫోటోను షేర్ చేశారు జ్యోతిక. ప్రస్తుతం ఈ క్యూట్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అందులో జ్యోతికతోపాటు.. ఆమె ఇద్దరు పిల్లలు.. ఓ పప్పీ కూడా కూర్చొని ఉంది. ఈ ఫోటోలలో వీరింత చాలా క్యూట్ అండ్ స్వీట్ గా కనిపిస్తున్నారు. చేతిలో పప్పీతో జ్యోతిక నవ్వుతూ కనిపిస్తుంటే.. పక్కనే దియా, దేవ్ సైతం చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. అయితే దేవ్..చిన్నప్పటి నుంచి సూర్య లాగే కనిస్తాడు. ఇక కూతురు దియా కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది.

Suriya, Jyotika

Suriya, Jyotika

సూర్య.. జ్యోతిక క్షణం తీరిక లేకుండా గడిపిస్తోన్న తన కుటుంబానికి మాత్రం వీలైనంత సమయాన్ని అందిస్తుంటారు. ఇదిలా ఉంటే.. కేవలం నటిగానే కాకుండా.. జ్యోతిక నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఇటీవల తన భర్త నటించిన ఆకాశం నీ హద్దురా, జైభీమ్ సినిమాలను కూడా తనే ప్రొడ్యూస్ చేసింది. ఇటీవలే సాయి పల్లవి నటించిన గార్గి చిత్రాన్ని కూడా జ్యోతికనే నిర్మించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.