AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి

నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి

Phani CH
|

Updated on: Feb 03, 2026 | 11:28 AM

Share

శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో మంత్రి సవిత బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న యువకుడిని ఆపి, హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. అతని తల్లికి ఫోన్ చేసి, పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని సూచించారు. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, యువకుడికి అప్పటికప్పుడు హెల్మెట్ తెప్పించి ధరింపజేశారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పెనుకొండలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంత్రి సవిత స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఇదే సమయంలో సోమందేపల్లికి చెందిన యువకుడు సాయి హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తూ మంత్రికి తారసపడ్డాడు. యువకుడిని ఆపిన మంత్రి, బైక్ ధర ఎంతని ప్రశ్నించారు. అందుకు యువకుడు రెండున్నర లక్షలు అని చెప్పాడు. వెంటనే మంత్రి సవిత “రెండున్నర లక్షల బైక్ ఓకే… మరి హెల్మెట్ ఎక్కడ?” అంటూ గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా సాయి తల్లికి ఫోన్ చేసి, ఖరీదైన బైక్ కొనివ్వడంతో సరిపోదని, బైక్‌తో పాటు హెల్మెట్‌ కూడా కొనివ్వాలని, హెల్మెట్‌ ధరించాల్సిన ఆవశ్యకతను పిల్లలకు చెప్పాలని, అది తల్లిదండ్రులుగా మీ బాధ్యత అని మంత్రి సూచించారు. మరోసారి హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు. అప్పటికప్పుడు యువకుడికి హెల్మెట్ తెప్పించి, స్వయంగా అతనికి ధరింపజేశారు. ప్రతి ఒక్కరూ బైక్‌పై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి

జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..

చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్.. హిట్ కావాలంటే తప్పదు బాస్

ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?

Sreeleela: స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా ??