AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి

ఆ బ్యాంక్‌ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి

Phani CH
|

Updated on: Feb 03, 2026 | 11:25 AM

Share

నెగటివ్ ఇంట్రెస్ట్ రేట్లు అంటే మీ డబ్బును బ్యాంకులో దాచుకోవడానికి మీరే బ్యాంకుకు చెల్లించడం. యూరప్, స్విట్జర్లాండ్‌లోని కొన్ని బ్యాంకులు ఈ విధానాన్ని అనుసరిస్తాయి. ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. వడ్డీ రాకపోగా, మీ డిపాజిట్‌కు నిర్వహణ ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. స్విస్ బ్యాంకులు భద్రత, గోప్యతకు ప్రాధాన్యతనిస్తాయి కాబట్టి భారీ మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తాయి.

సాధారణంగా బ్యాంకులో డబ్బు దాచుకుంటే వడ్డీ వస్తుంది. కానీ ఆ బ్యాంకులలో పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ డిపాజిట్ చేసిన సొమ్ముపై వడ్డీ రాకపోగా, భద్రత, నిర్వహణ కోసం కస్టమర్లే బ్యాంకుకు డబ్బు చెల్లించాల్సి వస్తోంది. దీనినే ‘నెగటివ్ ఇంట్రెస్ట్’ అంటారు. ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు యూరప్, స్విట్జర్లాండ్‌లోని కొన్ని ప్రభుత్వాలు ఈ వింత విధానాన్ని అనుసరిస్తాయి. వడ్డీ ఆశతో మనలో చాలా మంది బ్యాంకుల్లో ఎఫ్‌డీల రూపంలో డబ్బు దాస్తూ ఉంటారు. కానీ ఓ చోట బ్యాంకులో డబ్బు పెడితే తిరిగి మనమే వడ్డీ కట్టాలనే విషయం మీకు తెలుసా. ముఖ్యంగా యూరప్, స్విట్జర్లాండ్‌లో ఈ పరిస్థితి ఉంది. అక్కడ మీరు బ్యాంకుకు డబ్బు ఇచ్చి దాచుకోమని అడిగితే, వారు అందుకు ప్రతిఫలంగా మీ నుండే వడ్డీ లేదా సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తారు. ఈ ఆర్థిక విధానాన్ని Negative Interest Rate అంటారు. మీరు బ్యాంకులో ఉంచిన సొమ్ము పెరుగుతూ పోవడానికి బదులు తగ్గుతూ వస్తుంది. ఉదాహరణకు, మీరు రూ. లక్ష డిపాజిట్ చేస్తే, ఏడాది ముగిసే సరికి అది రూ. 99,000 లేదా అంతకంటే తక్కువకు చేరొచ్చు. ఇది స్కామ్ కాదు, యూరోప్‌ దేశాల్లోని బ్యాంకులు తీసుకునే అధికారిక నిర్ణయం. ప్రపంచ కుబేరులు తమ సొమ్మును భద్రంగా స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారు. ఈ బ్యాంకులు సంపదను పెంచడం కంటే, ప్రైవసీకి, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తాయి. అందుకే ఇక్కడ డిపాజిట్ చేసిన వారికి వడ్డీ ఇవ్వకపోగా, భారీగా మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..

చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్.. హిట్ కావాలంటే తప్పదు బాస్

ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌ ఎలా కలెక్ట్ చేస్తారు..?

Sreeleela: స్టెప్పులేయడానికి శ్రీలీల సిద్ధమైతే.. సాయిపల్లవి సైడిచ్చినట్టేనా ??

రెండేళ్లకి ఒకటైతే కుదరదు.. స్టార్లు స్పీడు పెంచాల్సిందే