బాబోయ్ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం తొర్రేడులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెండు ఆవులను చంపి, పంట పొలాల్లో తిరుగుతున్న పులిని గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు పులి వయసు 3-4 ఏళ్లుగా అంచనా వేశారు. ప్రజలు పొలాలకు వెళ్లవద్దని, ఇళ్ళలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కెమెరా ట్రాప్‌లు, బోన్లతో పులిని బంధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం తొర్రేడు గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి రెండు ఆవులను చంపి తినేసిందని గుర్తించారు గ్రామస్తులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పెద్దపులి పంట పొలాల్లో సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎదురుగానే పెద్దపులి నడుచుకుంటూ వెళ్లడంతో అక్కడినుంచి పరుగులు తీశారు స్థానికులు.ప్రజలు ఎవరూ బయటకు రావద్దంటూ మైకుల ద్వారా అనౌన్స్మెంట్లు చేస్తున్నారు పోలీసులు. పులి చత్తీస్‌ఘడ్ నుండి పశ్చిమగోదావరి జిల్లా వచ్చి అక్కడనుండి గోదావరి మీదుగా తూర్పుగోదావరి జిల్లా చేరుకున్నట్లు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులి వయసు సుమారు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఉంటుందని వెల్లడించారు డిఎఫ్ఓ ప్రభాకర్. పులిసంచారంపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం పులి సంచరిస్తున్న క్రమంలో రైతులను పొలాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ట్యాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. పులిని బంధించేందుకు నాలుగు బోన్లను అమర్చినట్లు డిఎఫ్ఓ ప్రభాకర్ వెల్లడించారు. శనివారం పోలవరం వైపు నుంచి సీతానగరం మండలం పెద్ద కొండేపూడి వైపు రహదారి వెంబడి పంట పొలాల్లోకి చేరుకున్నట్లు పాదముద్రను గుర్తించారు అధికారులు. పెద్దపులి సంచారంపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు…
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్ తీసుకున్న మంత్రి
ఆ బ్యాంక్ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి
జాలర్ల వలలో అరుదైన 300 కేజీల చేప..
చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్.. హిట్ కావాలంటే తప్పదు బాస్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

