దక్షిణాది సినీపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంటుంది.
ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, మిడిల్ క్లాస్ అబ్బాయి, తండేల్ చిత్రాల్లో మెప్పించి ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది.
ఇదెలా ఉంటే.. సాయి పల్లవి అస్సలు మేకప్ వేసుకోదు అన్న సంగతి తెలిసిందే. తాను కేవలం సన్ స్క్రిన్ మాత్రమే ఉపయోగిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
మరొసారి సాయి పల్లవి ఫిట్‌నెస్ విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ బ్యూటీ అస్సలు జిమ్ కు వెళ్లి కఠినమైన వ్యాయామాలు చేయనని గతంలో చెప్పుకొచ్చింది.
ప్రతిరోజూ అరగంట కంటిన్యూస్ గా డ్యాన్స్ చేస్తే 200 నుంచి 400 వరు క్యాలరీలు కరిగించవచ్చట. అంతేకాదు సాయి పల్లవి వేగన్. ఆమె ఆకు కూరలు తీసుకుంటుంది.
అలాగే యోగా, మెడిటేషన్ ద్వారా తన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటుందట. డ్యాన్స్ వల్ల హార్ట్, లంగ్స్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఏరోబిక్ ఫిట్నెస్ పెరుగుతుంది.
మజిల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. వెయిట్ మానేజ్మెంట్ చేయడం తేలికవుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి, ఆస్టియోపొరాసిస్ యొక్క రిస్క్ తగ్గుతుంది. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.